Devil Closing Collections డెవిల్‌కు దారుణంగా కలెక్షన్లు.. కల్యాణ్ రామ్ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?
నందమూరి కల్యాణ్‌రామ్, సంయుక్త మీనన్ నటించిన పిరియాడిక్ మూవీ డెవిల్. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు ఈ సినిమా భారీగా బజ్ క్రియేట్ చేసింది. అయితే ఊహించినట్టే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఎక్కువగానే అంచనా వేశారు. కానీ అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ సినిమా వసూళ్లు షాక్ గురిచేశాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఎంత వసూలు చేసింది? బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? లాభమా? నష్టమా? అనే విషయంలోకి వెళితే..
డెవిల్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే. మూవీని సుమారుగా 45 కోట్ల రూపాయలతో నిర్మించామని నిర్మాత అభిషేక్ నామా స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాను పలుచోట్ల స్వయంగా రిలీజ్ చేయడంతో 21 కోట్ల రూపాయలను బిజినెస్‌ను వాల్యూ చేశారు. దాంతో గతంలో కల్యాణ్ రామ్‌కు భారీ హిట్ ఇచ్చిన బింబిసార వసూళ్లను ఆధారంగా చేసుకొని ఈ సినిమా టార్గెట్ భారీగానే ఫిక్స్ చేశారు.

డెవిల్ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో ఈ మూవీ 5.5 కోట్లు, సీడెడ్‌లో 4 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 8 కోట్ల రూపాయలు మేర బిజినెస్‌ను అంచనా వేశారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్లకుపైగా బిజినెస్‌ను అంచనా వేశారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 1.6 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 2 కోట్లుగా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమాబిజినెస్ 21 కోట్లుగా అంచనా వేశారు.
డెవిల్ మూవీ 21 కోట్ల టార్గెట్‌తో బిజినెస్ మొదలుపెట్టింది. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో ఆంధ్రా, నైజాంలో 500 స్కీన్లు, ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ బజ్ క్రియేట్ చేయడంతో తొలి రోజు ఈ సినిమాకు తొలి రోజు ఓ మాదిరి వసూళ్లు నమోదు అయ్యాయి. తొలి రోజు ఈ సినిమా ఏపీ, తెలంగాణలో 3.4 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 40 లక్షలు, ఓవర్సీస్‌లో 80 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

డెవిల్ చిత్రం తొలి వారాంతంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రెండో రోజు 3.5 కోట్ల గ్రాస్, మూడో రోజు 3.75 కోట్ల గ్రాస్, 4వ రోజు 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను వరల్డ్ వైడ్‌గా రాబట్టింది. ఇక 5వ రోజు 80 లక్షలు, 6వ రోజు 75 లక్షలు, ఏడో రోజు 70 లక్షల రూపాయలు నమోదు చేసింది. తొలివారంలో 14 కోట్ల వసూళ్లను రాబట్టింది. 8వ రోజు 47 లక్షలు, 9వ రోజు 60 లక్షల రూపాయలు నమోదు చేయడంతో 15 కోట్ల మేర వసూళ్లు నమోదు అయ్యాయి.

వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 21 కోట్ల టార్గెట్‌తో కలెక్షన్లను రాబట్టిన డెవిల్ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడానికి కష్టపడింది. ఇంకా ఈ సినిమా 6 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ సినిమా తక్కువలో తక్కువ వాల్యూ బిజినెస్‌కు 4 కోట్ల నష్టంతో ముగిసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











