Devil 4 Days Collections డెవిల్‌కు బాక్సాఫీస్ గడ్డు పరిస్థితి.. భారీ నష్టాల నుంచి బయట పడాలంటే?

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించగా నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యాల్యూ ఎంత? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేస్తున్న వసూళ్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Recommended Video

Devil 4 Days Collections డెవిల్‌ భారీ నష్టాల నుంచి బయట పడాలంటే? | Telugu Filmibeat

డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను 45 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినట్టు అభిషేక్ నామా ఇటీవల వెల్లడించారు. ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్స్ నిర్వహించడంతో కొంత మేరకు బజ్ క్రియేట్ అయింది.

Devil Movie day 4 Collections Worldwide: Kalyan Rams movie heading towards Heavy Losses

ఇక ప్రమెషనల్ ఈవెంట్స్, గ్లింప్స్, ట్రైలర్స్‌తో బజ్ క్రియేట్ కావడం, బింబిసార హిట్ ప్రభావంతో డెవిల్ మూవీకి ప్రి రిలీజ్ భారీగానే వాల్యూ కట్టారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే.. నైజంలో 5.5 కోట్లు, సీడెడ్‌లో 4 కోట్లు, ఆంధ్రాలో 8 కోట్ల రూపాయలు మేర జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో 17.5 కోట్ల బిజినెస్ జరిగింది.

ఇక కర్ణాటక రైట్స్ 1.5 కోట్లు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు 21 కోట్ల రూపాయల బిజినెస్ వ్యాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బిజినెస్ కూడా భారీగా జరగడంతో ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో అంటే తెలుగు రాష్ట్రాల్లో 450 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Devil Movie day 4 Collections Worldwide: Kalyan Rams movie heading towards Heavy Losses

డెవిల్ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ట్రేడ్ వర్గాలు వెల్లడించిన ప్రకారం.. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 4.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ఆంధ్రాలో 3.4 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 40 లక్షలు, ఓవర్సీస్‌లో 80 లక్షల వసూళ్లు సాధించింది. ఇక రెండో రోజు 3.55 కోట్లు, నాలుగో రోజు 3.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో మూడు రోజుల్లో ఆంధ్రా, నైజాంలో 9 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఇక న్యూ ఇయర్ సెలవు దినం రోజున కొంత మెరుగ్గా కలెక్షన్లు సాధించినప్పటికీ.. ఆశాజనకంగా లేదనేది ట్రేడ్ రిపోర్ట్. ఈ సినిమా 4వ రోజున 3.25 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 11.4 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

Devil Movie day 4 Collections Worldwide: Kalyan Rams movie heading towards Heavy Losses

కల్యాణ్ రామ్ డెవిల్ చిత్రం భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 21 కోట్ల షేర్, 42 గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. సంక్రాంతి రేసులో భారీ సినిమాలు వస్తున్నందున ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? అనే అనుమానంగా మారింది. రానున్న 10 రోజుల్లో ఈ సినిమా 25 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X