Dhadak 2 Box Office Day 1: ధడక్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ .. తృప్తి దిమ్రి మూవీకి ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?
తృప్తి దిమ్రి, సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన చిత్రం ధడక్. ఆగస్ట్ 1న విడుదలైన ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు. ధర్మా ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, క్లౌడ్ 9 పిక్చర్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఉమేష్ కుమార్ బన్సాల్, అదర్ పూనావాలా, అపూర్వ మెహతా, మీనూ అరోరా, సొమెన్ మిశ్రా, ప్రగతి దేశ్‌ముఖ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. తనుజ్ టికూ ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండగా.. రోచక్ కోహ్లి, తనిష్క్ బాగ్చి, జావెద్ మోహిసిన్, శ్రేయాస్ పుర్నిక్‌లు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. సిల్వస్టర్ ఫోన్సెకా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ధడక్ 2 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? ఫస్ట్ డే ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
ధడక్ 2 బడ్జెట్ ఎంత?
మీడియం రేంజ్ సినిమానే అయినప్పటికీ ఈ చిత్రానికి ఎక్కడా తగ్గుకుండా నిర్మాతలు ఖర్చుచేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలకు అయిన ఖర్చు కలిపి ధడక్ 2 చిత్రానికి రూ.55 కోట్ల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ధడక్ 2 చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ అంచనాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో ధడక్ 2 చిత్రాన్ని విడుదల చేశారు.

సైయారాతో పోలిక
ప్రస్తుతం థియేటర్లను ఊపేస్తోన్న సైయారా సినిమాతో ఈ సినిమాను పోల్చి చూస్తున్నారు. ఈ మూవీకి ఫస్ట్ డే 21.5 కోట్ల రూపాయల ఓపెన్సింగ్స్ రాగా.. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఇండియాలో 280 కోట్ల రూపాయల నెట్, ఇండియాలో 336.65 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో 105 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 441.65 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. సైయారా మాదిరిగానే ధడక్ 2 కూడా మౌత్ టాక్‌తో కలెక్షన్స్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
మల్టీప్లెక్స్‌లలో సాలీడ్ బుకింగ్
2018లో తెరకెక్కిన ధడక్ చిత్రానికి సీక్వెల్‌గా పేరు తెచ్చుకున్న ధడక్ 2పై అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు యానిమల్‌తో తృప్తి దిమ్రికి నేషనల్ వైడ్ పాపులారిటీ దక్కడంతో ఈమె నుంచి సినిమా వస్తుండటంతో హైప్ క్రియేట్ అయ్యింది. ధడక్ 2 చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కింద 18 వేల టికెట్ల బుక్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. చెన్నై, కోల్‌కతా, జైపూర్ నగరాలలో అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వంటి లీడింగ్ మల్టీప్లెక్స్‌లలోనూ ధడక్ 2కు మంచి బుకింగ్ జరుగుతోంది.
ధడక్ 2 తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
ధడక్ 2 తొలిరోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. సాయంత్రం 4 గంటల వరకు 18.66 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిల్క్ తెలిపింది. ముంబైలో 339 షోలు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 432 షోలు, పుణేలో 146 షోలు, బెంగళూరులో 96 షోలు, కోల్‌కతాలో 122, అహ్మదాబాద్‌లో 245 షోలు ప్రదర్శితమయ్యాయి. తొలి రోజు తృప్తి దిమ్రి సినిమాకు ఇండియాతో పాటు ఓవర్సీస్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ధడక్ 2 ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











