Dhamaka day 1 Collections.. మాస్ మహారాజ్ కలెక్షన్ల కుమ్ముడు.. ధమాకాకు రికార్డు ఓపెనింగ్స్!
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా భారీ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తున్నది. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మాస్ మసాలా చిత్రం క్రిస్మస్ సెలవుల్లో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో ధమాకా చిత్రం తొలి రోజు ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే విషయంలోకి వెళితే..

డైలాగ్స్, పాటలు, కామెడీ అంశాలు
ధమాకా చిత్రం రెగ్యులర్, రొటీన్ కథ, కథనాలతో తెరకెక్కినప్పటికీ.. సన్నివేశాల పరంగా రిచ్ కంటెంట్, పాటలు, మాస్ యాక్షన్ అంశాలు ప్రేక్షకుల్లో జోష్‌ను పెంచుతున్నది. రిలీజ్‌కు ముందే భీమ్ అందించిన మ్యూజిక్‌కు మంచి స్పందన రావడంతో అనూహ్యంగా బిజినెస్ సొంతం చేసుకొన్నది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద రవితేజ తన కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది.

తొలి రోజు రికార్డు ఒపెనింగ్స్
ధమాకా చిత్రానికి తొలి రోజున మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే మాస్, కమర్షియల్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా చేశాయి. దాంతో సాయంత్రం ఆటలకు మంచి రెస్పాన్స్ లభించింది. దాంతో విడుదలైన చాలా ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి. దాంతో రవితేజ కెరీర్‌లోనే తొలి రోజు రికార్డు వసూళ్లు సాధించిన చిత్రంగా బాక్సాఫీస్ వద్ద ధమాకా రుజువు చేసింది. ఈ సినిమాకు క్రిస్మస్ హాలీడేస్ కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి.

రిలీజ్‌కు ముందు లాభం ఎంతంటే?
ధమాకా చిత్రాన్ని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సుమారు 40 కోట్లతో నిర్మించినట్టు సమాచారం. నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో 32 కోట్ల రూపాయలు సంపాదించింది. ఇక థియేట్రికల్ బిజినెస్ రూపంలో 18.30 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రిలీజ్‌కు ముందే 10 కోట్ల లాభాలను పంచిపెట్టినట్టు తెలిసింది.

తొలి రోజు ఆక్యుపెన్సీ
ధమాకా చిత్రం తొలి రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. కాకినాడలో 74 శాతం, విజయవాడలో 40 శాతం, గుంటూరులో 40 శాతం, వైజాగ్‌లో 55 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక వరంగల్‌లో 65 శాతం, నిజమాబాద్‌లో 50 శాతం, కరీంనగర్‌లో 60 శాతం, మహబూబ్ నగర్‌లో 55 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
ధమాకా చిత్రం తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 3 కోట్లకుపైగా గ్రాస్, 2 కోట్ల షేర్ సాధించింది. హైదరాబాద్‌లోనే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 40 లక్షల వరకు వసూళ్లు సాధించింది. తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 5.5 కోట్లు రాబట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దాదాపు 25 శాతం కలెక్షన్లను సాధించింది. తొలి వారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఏపీ, నైజాం విషయానికి వస్తే..
సీడెడ్‌లో 66 లక్షలు, ఉత్తరాంధ్ర 56 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 24 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 16 లక్షలు, గుంటూరు 40 లక్షలు, కృష్ణా జిల్లాలో 25 లక్షలు, నెల్లూరు జిల్లాలో 13 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఏపీ, నైజాంలో 4.5 కోట్లు షేర్, 7.6 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాయింది.

ధమాకా లాభాల్లోకి రావాలంటే?
ఏపీ, తెలంగాణలో మొత్తంా 4.5 కోట్ల షేర్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా 45 లక్షలు, ఓవర్సీస్‌లో 15 లక్షలు సాధించింది. దాంతో ఈ చిత్రం 5.1 కోట్లు షేర్, 10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా 13.9 కోట్లు సాధించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











