Dhamaka Total Collections 18 కోట్ల బిజినెస్.. ఎన్ని కోట్ల లాభమంటే? రవితేజ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్!

మాస్ మహారాజ్ రవితేజ, గ్లామర్ క్వీన్ శ్రీలీల జంటగా నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో రూపొందిన ధమాకా చిత్రం సంచలన విజయం నమోదు చేసుకొన్నది. రిలీజ్‌కు మ్యూజికల్‌గా హిట్ టాక్ అందుకొన్నప్పటికీ ఈ చిత్రం కొద్దిపాటి అంచనాలతో బాక్సాఫీస్ బరిలోకి దూకింది.

అయితే విడుదలైన ప్రతీ చోట మిక్స్‌డ్ టాక్ అందుకొన్న ఈ చిత్రం మౌత్ టాక్‌తో పాజిటివ్ జోన్‌లోకి చేరుకొన్నది. తొలి రోజు నుంచే రవితేజ కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన ఫైనల్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

శ్రీలీల స్టెప్పులు, గ్లామర్‌తో

శ్రీలీల స్టెప్పులు, గ్లామర్‌తో

ధమాకా సినిమా ప్రేక్షకులను అలరించడానికి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోల్స్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. పాటలకు తగినట్టుగా శ్రీలీల వేసిన స్టెప్పులు, ఎప్పటిలానే రవితేజ మేనరిజం సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. అలాగే రెగ్యులర్ కథ అయినప్పటికీ.. త్రినాథ రావు సినిమాను రూపొందించిన విధానం సగటు ప్రేక్షకుడిని కట్టి పడేసిందని చెప్పవచ్చు.

ధమాకాపై ఎలాంటి అంచనాలంటే?

ధమాకాపై ఎలాంటి అంచనాలంటే?

ఇంతకు ముందు రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో ధమాకాపై పెద్దగా బిజినెస్ పరంగా అంచనాలు తక్కువే ఉండేవి. దాంతో సినిమాకు పెద్దగా బిజినెస్ జరగలేదు. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ధమాకా సినిమా విషయం ముందు వెనుక ఆలోచించారనేది ట్రేడ్ వర్గాలు సమాచారం.

ధమాకా తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

ధమాకా తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

ఇక ధమాకా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో థియేట్రికల్ హక్కులను 5.5 కోట్లకు, సీడెడ్ హక్కులు 2.5 కోట్లు, ఆంధ్రాలోని వివిధ జిల్లాల హక్కులు 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల మేర బిజినెస్‌ను నమోదు చేసింది.

 ప్రపంచవ్యాప్తంగా బిజినెస్

ప్రపంచవ్యాప్తంగా బిజినెస్

అలాగే ధమాకా తెలుగేతర రాష్ట్రాల్లో కూడా ఓ మోస్తారు బిజినెస్ జరిగింది. కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ అంతా కలిపి 2.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 18.5 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని 19.5 కోట్లుగా ట్రేడ్ వర్గాలు నిర్ణయించాయి.

నైజాం, ఆంధ్రాలో ధమాకా కలెక్షన్లు

నైజాం, ఆంధ్రాలో ధమాకా కలెక్షన్లు

ఇక తెలుగు రాష్ట్రాల్లో టోటల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 18 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో 7.25 కోట్లు, గుంటూరులో 2 కోట్లు, కృష్ణా 2 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1 కోటి, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కోటి, తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్లు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 4.5 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం సుమారు 37 కోట్ల షేర్ 70 కోట్ల గ్రాస్ రూపాయలను వసూలు చేసింది.

ధమాకా వరల్డ్ వైడ్ కలెక్షన్లు

ధమాకా వరల్డ్ వైడ్ కలెక్షన్లు

ధమాకా చిత్రం తెలుగేతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 3.5 కోట్లకుపైగా, అమెరికా, ఇతర దేశాల్లో 2.75 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల షేర్, 85 కోట్ల రూపాయాల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ధమాకా లాభం ఎంతంటే?

ధమాకా లాభం ఎంతంటే?

ధమాకా చిత్రం బాక్సాఫీస్ జర్నీ 19.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో మొదలుపెట్టింది. థియేట్రికల్ రన్‌లో మొత్తంగా 45 షేర్ సాధించింది. అంటే ఈ చిత్రం 25.5 కోట్లకుపైగానే లాభాన్ని ఆర్జించింది. రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వసూళ్లను రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X