Don't Miss!
- News
Ajit Doval:అమెరికాలో ప్రధాని మోదీ ఆయుధం..!
- Sports
INDvsNZ : అదే నా కెప్టెన్సీ మంత్ర.. వాళ్ల వల్లే ఈ ట్రోఫీ: హార్దిక్ పాండ్యా
- Finance
Adani: పార్లమెంటుకు అదానీ పంచాయితీ.. విపక్షాల పట్టు.. మోదీ కాపాడతారా..?
- Lifestyle
Chanakya Niti: మహిళలు ఈ విషయాలను ఎప్పటికీ ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Technology
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Dhamaka Closing collections రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ మ్యాజిక్.. ఎన్ని కోట్ల లాభాన్ని కొల్లగొట్టిందంటే?
మాస్ మహారాజా రవితేజ, అందాల భామ శ్రీలీల కాంబినేషన్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ధమాకా. రిలీజ్‌కు ముందు మ్యూజికల్‌గా అంచనాల పెంచిన చిత్రం ఓ మోస్తారు అంచనాలతో విడుదలైంది. 23 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచి సక్సెస్ టాక్‌తో దూసుకెళ్లింది. ట్రేడ్ వర్గాల అంచనాలకు మించి ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. గత 28 రోజుల్లో థియేట్రికల్ రన్ ఎలా సాగింది? మొత్తంగా ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

పాటలు, కామెడీ ట్రాక్‌తో
ఇటీవల కాలంలో యువతరానికి కిక్కెస్తున్న శ్రీలలతో రవితేజ కాంబినేషన్ అనగానే ధమాకాపై యూత్ ఆసక్తి పెరిగింది. చాలా రోజు తర్వాత త్రినాధ్ రావు నక్కిన మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రంలోని పాటలు చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. అలాగే కామెడీ ట్రాక్స్ భారీగా వర్కువుట్ అయ్యాయి. దాంతో ఈ సినిమాకు మంచి రెస్సాన్ లభించింది.

ధమాకా బడ్జెట్ ఎంతంటే?
ధమాకా సినిమాను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సుమారు 40 కోట్లతో తెరకెక్కించారు. రిలీజ్‌కు ముందే శాటిలైట్, ఓటీటీ, థియేట్రికల్ బిజినెస్ భారీగా జరగడం, నాన్ థియేట్రికల్ 30 కోట్లు, థియేట్రికల్ 20 కోట్ల మేర బిజినెస్ జరగడంతో టేబుల్ ప్రాఫిట్‌తో ధమాకా రిలీజైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
ధమాకా సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజనెస్ వివరాల్లోకి వెళితే.. నైజాం హక్కులను 5.5 కోట్ల మేర, అలాగే సీడెడ్ 2.5 కోట్లు, ఆంధ్రాలో 8 కోట్లుతో ఈ సినిమా ఏపీ, తెలంగాణలో 16 కోట్ల బిజినెస్ చేసింది. ఇక కర్ణాటకలో 1 కోటి రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 25 లక్షలతో ఈ సినిమా 20 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదుచేసింది.

ఏపీ, తెలంగాణలో ధమాకా వసూళ్లు ఎంతంటే?
ధమాకా రిలీజైన తొలి ఆట నుంచే భారీగా వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ జైత్రయాత్రను మొదలుపెట్టింది. గత 28 రోజుల్లో ఈ చిత్రం నైజాంలో 19 కోట్లు, సీడెడ్ 8 కోట్లు, గుంటూరు 1.91 కోట్లు, కృష్ణ 1.85 కోట్లు, నెల్లూరు 1.25 కోట్లు, పశ్చిమ గోదావరి 1.3 కోట్లు, తూర్పు గోదావరి 1.35 కోట్లు, ఉత్తరాంధ్ర 4.75 కోట్లు సాధించింది. దాంతో ఈ చిత్రం సుమారు 40 కోట్ల షేర్, 70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?
ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాలతోపాటు అమెరికా, ఇతర దేశాల్లో ధమాకా చిత్రం రవితేజ కెరీర్‌లోనే ది బెస్ట్ కలెక్షన్లను రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 3.75 కోట్లు, ఓవర్సీస్‌లో 3 కోట్ల మేర వసూళ్లు సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాపత్ంగా 45 కోట్లు షేర్, 85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా భారీ లాభాలను నమోదు చేసి.. రవితేజ కెరీర్‌లోనే అత్యుత్తమ కలెక్షన్లను సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది.

ఎన్ని కోట్ల లాభం వచ్చిందంటే?
రవితేజ్ గత చిత్రాల ఫలితాలను చూస్తే... ధమాకా సినిమా బ్రేక్ ఈవెన్ చాలా కష్టంగానే అనిపించింది. దాదాపు 20 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ చిత్రం తొలి మూడు, నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి ప్రవేశించింది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ధమాకా చిత్రం దాదాపు 25 కోట్ల షేర్ డిస్టిబ్యూటర్లకు పంచిపెట్టింది. 2022 చివర్లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.