twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dhamaka day 4 collections 50 కోట్లకు చేరువగా ధమాకా.. కలెక్షన్ల జోరు తగ్గని రవితేజ మూవీ

    |

    మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు త్రినాథ రావు నక్కిన కాంబినేషన్‌లో వచ్చిన ధమాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నది. డిసెంబర్ 23 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ భారీ కలెక్షన్లను సొంతం చేసుకొంటున్నది. నిర్మాత విశ్వప్రసాద్ రూపొందించిన ఈ సినిమా మొదటి రోజు నుంచి ప్రతీ రోజు అంతకు అంతగా వసూళ్లను రాబడుతున్నది. రికార్డుస్థాయిలో గత నాలుగు రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

    మూడో రోజుల్లోనే 32 కోట్లు

    మూడో రోజుల్లోనే 32 కోట్లు

    ధమాకా చిత్రం తొలి వారాంతంలో రికార్డుస్థాయి కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజున 4.66 కోట్లు, రెండో రోజున 3.53 కోట్లు, మూడో రోజున 5.18 కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 32 కోట్ల రూపాయలు వసూలు చేయడం ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపింది.

    ధమాకా నాలుగో రోజున ఆక్యుపెన్సీ

    ధమాకా నాలుగో రోజున ఆక్యుపెన్సీ

    ఇక ధమాకా సినిమా నాలుగు రోజున కూడా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే సాధారణంగా ప్రతీ సోమవారం కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద డల్‌గా ఉంటుంది. కానీ ధమాకా అలాంటి పరిస్థితిని ఎదురించి భారీ ఆక్యుపెన్సీని సాధించింది.హైదరాబాద్‌లో 35 శాతం, వరంగల్‌లో 50 శాతం, గుంటూరులో 35 శాతం, వైజాగ్‌లో 30 శాతం, నిజమాబాద్‌లో 40 శాతం, కరీంనగర్‌లో 35 శాతం, కాకినాడలో 50 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.

    ఓవర్సీస్‌లో ధమాకా కలెక్షన్లు

    ఓవర్సీస్‌లో ధమాకా కలెక్షన్లు

    ఓవర్సీస్‌లో ధమాకా చిత్రం దూసుకెళ్తున్నది. ఓ వైపు విదేశాల్లో అవతార్ 2 చిత్రం రికార్డులు కొల్లగొడుతుంటే.. ఆ సినిమా ధాటికి తగినట్టుగానే రవితేజ తన సినిమాతో భారీ వసూళ్లు సాధించడం విశేషం. అమెరికాలో ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో 250K డాలర్లను అంటే దాదాపు 2 కోట్లకుపైగానే వసూళ్లను సాధించింది. ఇంకా భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది.

    4వ రోజున ధమాకా వసూళ్లు

    4వ రోజున ధమాకా వసూళ్లు

    ధమాకా చిత్రం నాలుగో రోజున ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లను సాధించింది. నైజాంలో ఈ చిత్రం 1.4 కోట్లే, సీడెడ్‌లో 60 లక్షలు, గుంటూరులో 16 లక్షలు, కృష్ణా జిల్లాలో 19 లక్షలు, నెల్లూరు జిల్లాలో 9 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 15 లక్షలు, ఉత్తరాంధ్రలో 36 లక్షలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఈ చిత్రం 3 కోట్లకుపైగా షేర్ సాధించింది.

    4 రోజుల్లో ధమాకా కలెక్షన్లు

    4 రోజుల్లో ధమాకా కలెక్షన్లు

    ధమాకా చిత్రం గత నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఈ చిత్రం 7.44 కోట్లు, సీడెడ్‌లో 2.82 కోట్లు, గుంటూరులో 1.07 కోట్లు, కృష్ణా జిల్లాలో 98 లక్షలు, నెల్లూరు జిల్లాలో 52 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 61 లక్షలు, తూర్పూ గోదావరి జిల్లాలో 88 లక్షలు, ఉత్తరాంధ్రలో 2.04 కోట్లు వసూలు చేసింది. ఏపీ, నైజాంలో గత నాలుగు రోజుల్లో 16 కోట్లకుపైగా షేర్లు సాధించింది.

    ప్రపంచవ్యాప్తంగా లాభం ఎంతంటే?

    ప్రపంచవ్యాప్తంగా లాభం ఎంతంటే?

    ఇక తెలుగేతర రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ధమాకా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1.4 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో 2 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మేర షేర్, 41 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కూడా సాధించింది. త్వరలోనే 50 కోట్ల మైలురాయిని అధిగమించే అవకాశం కనిపిస్తున్నది.

    English summary
    Mass Maharaja Ravi Teja’s mass action entertainer Dhamaka hit the screens yesterday to super positive talk from all corners. Mass Maharaja Ravi Teja, Trinadha Rao Nakkina, TG Vishwa Prasad’s Dhamaka Collected 41 Cr + Gross Worldwide In 4 Days
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X