Don't Miss!
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- News
మంత్రి రోజాకు మరో పదవి
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Dhamaka day 5 collections ఐదో రోజు బాక్సాఫీస్ వద్ద అదే ధమాకా.. రవితేజ్ మూవీకి ఎంత లాభమంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా చిత్రం నిలకడగా వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద బలంగా కనిపిస్తున్నది. తొలి రోజు నుంచి రికార్డు కలెక్షన్లను సాధిస్తూ అదే జోష్‌తో 50 కోట్లకు చేరువైంది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న రవితేజ 2022 భారీ హిట్‌తో ముగించేందుకు సిద్దమయ్యారు. గత నాలుగు రోజుల్లో 42 కోట్ల సాధించిన ఈ చిత్రం.. 5 వ రోజు ఏ మేరకు వసూళ్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

దేశవ్యాప్తంగా వసూళ్లు
ధమాకా చిత్రం తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 6.7 కోట్లు, రెండో రోజున 5.7 కోట్లు, మూడో రోజున 8.1 కోట్లు, నాలుగో రోజున 4.65 కోట్లు, ఐదో రోజున 3.4 కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం నాలుగు రోజుల్లో 25.6 కోట్ల షేర్ సాధించింది.

5వ రోజు ఆక్యుపెన్సీ ఇలా..
ఇక ఐదో రోజు ధమాకా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 25 లక్షలు, వరంగల్‌లో 40 శాతం, గుంటూరులో 35 శాతం, వైజాగ్‌లో 25 శాతం, నిజమాబాద్‌లో 25 శాతం, కాకినాడలో 45 శాతం ఆక్యుపెన్సీ సాధించంది. దాంతో ఈ చిత్రం కాస్త మెరుగైన వసూళ్లను సాధించింది.

ఓవర్సీస్‌లో కలెక్షన్ల వివరాలు
ధమాకా చిత్రం ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడాలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది. ఇప్పటికే అమెరికాలో 250K డాలర్లను వసూలు చేసిన ఈ చిత్రం 5 రోజున 280K డాలర్లను నమోదు చేసింది. ఇక ఇతర దేశాల్లో కలిపితే.. సుమారు 400k వసూళ్లను సాధించింది.

కర్ణాటక రాష్ట్రంలో
ఇక కర్ణాటక రాష్రంలో కూడా ధమాకా తెలుగు వెర్షన్ భారీ వసూళ్లను సాధించింది. తొలి రోజు 24 షేర్, రెండో రోజున 49 లక్షల షేర్, మూడో రోజున 56 లక్షల షేర్, నాలుగో రోజున 16.13 షేర్, 5వ రోజున 13.56 లక్షల షేర్ సాధించింది. దాంతో ఈ చితరం 1.58 కోట్ల వసూళ్లను కర్ణాటకలో నమోదు చేయడం విశేషంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంత లాభం అంటే
ఇదిలా ఉండగా, ధమాకా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వసూళ్లను సాధించింది. నైజాం, ఏపీలో కలిపి ఈ చిత్రం 3 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 32కోట్ల షేర్, 49 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను పంచిపెడుతున్నది.