Dhandoraa Closing Collections: దండోరా క్లోజింగ్ కలెక్షన్స్.. శివాజీ మూవీకి లాభమెంత? నష్టమెంత?

ఇటీవలి కాలంలో జనం దృష్టిని ఆకర్షించిన చిత్రం దండోరా. టీజర్, ట్రైలర్‌లతో పాటు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అనసూయతో వివాదం కారణంగా ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీని ప్రభావం దండోరా కలెక్షన్స్‌పై పడినట్లుగానే ఉంది. ఈ నేపథ్యంలో దండోరా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? దండోరా క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? శివాజీ మూవీకి లాభమెంత? నష్టమెంత? ఈ వివరాల్లోకి వెళితే...

దండోరా తారాగణం
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని దండోరా చిత్రాన్ని నిర్మించారు. న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. దండోరా మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫిని, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా, మార్క్ కే రాబిన్ మ్యూజిక్, క్రాంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్‌గా, రేఖా బొగ్గార‌పు కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన దండోరా మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

Dhandoraa Box Office Closing Collections Worldwide How much loss or profit for Hero Sivaji s Movie

దండోరా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి దండోరా చిత్రానికి 5 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా దర్శక నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రూరల్ ఏరియాలలో పూర్తి గ్రామీణ వాతావరణంలో దండోరా చిత్రం చిత్రీకరణ జరుపుకున్నట్లుగా తెలుస్తోంది.

దండోరా బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంత?
దండోరా మూవీకి సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు తెలియాల్సి ఉంది. ట్రేడ్ వర్గాల చెబుదానిని బట్టి ప్రకారం శివాజీ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 6 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని అంచనా వేస్తున్నారు.

దండోరా కలెక్షన్స్
దండోరాకు తొలి రోజు 19 లక్షల రూపాయలు, రెండో రోజున 17 లక్షల రూపాయలు, మూడో రోజున 23 లక్షల రూపాయలు, నాలుగో రోజున 19 లక్షల రూపాయలు, ఐదో రోజున 5 లక్షల రూపాయలు, ఆరో రోజున 5 లక్షల రూపాయలు, ఏడో రోజన 4 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో 92 లక్షల రూపాయల నెట్.. 1.02 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

దండోరాకు లాభమెంత? నష్టమెంత?
మిక్స్‌డ్ టాక్‌కి తోడు హీరో శివాజీ - అనసూయ వివాదం కూడా కొంతమేర ఈ సినిమాపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దురంధర్, అవతార్ 3, అఖండ 2 వంటి భారీ చిత్రాలతో పాటు శంబాల, ఛాంపియన్, ఈషా తదితర సినిమాలు బరిలో ఉండటంతో విపరీతమైన పోటీలో దండోరా నెగ్గుకురాలేకపోయిందని చెబుతున్నారు.

దండోరా చిత్రానికి 6 కోట్ల రూపాయల షేర్ రావాల్సి ఉండగా... కేవలం 60 లక్షల రూపాయల షేర్ మాత్రమే రాబట్టి దాదాపు 5 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ నష్టాన్ని మిగిల్చింది. అలాగే 12 కోట్ల రూపాయల గ్రాస్‌కు గాను ఏకంగా 11 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చింది ఈ చిత్రం. నిర్మాతలు దండోరా సినిమా కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. 20 శాతం మాత్రమే రికవరీ సాధించి ఫ్లాప్‌గా నిలిచింది దండోరా. అయితే ఓటీటీ రైట్స్, డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో హక్కులకు జరిగిన నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా నిర్మాత సేఫ్ జోన్‌లోకి వచ్చినట్లేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X