Dhandoraa Day 1 Collections: వివాదంలో హీరో శివాజీ.. దండోరాకి తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
కోర్ట్ సినిమా తర్వాత తన విలక్షణ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు సీనియర్ నటుడు శివాజీ. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తున్న ఆయన తాజాగా నటించిన చిత్రం దండోరా. టీజర్, ట్రైలర్లకు తోడు ఇటీవల హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై హీరోయిన్లు నిధి అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్‌తో పాటు స్టార్ యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయి శ్రీపాద తదితరులు ఆయనకు కౌంటర్ ఇచ్చారు. చివరికి తెలంగాణ మహిళా కమీషన్ వరకు వ్యవహారం వెళ్లింది.
ఈ క్రమంలో తను చేసిన వ్యాఖ్యలకు శివాజీ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ అనసూయకి, శివాజీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇలాంటి పరిస్ధితుల మధ్య విడుదలైన దండోరా సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు దండోరా చిత్రం ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

దండోరా తారాగణం
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని దండోరా చిత్రాన్ని నిర్మించారు. నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. దండోరా మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫిని, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా, మార్క్ కే రాబిన్ మ్యూజిక్, క్రాంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్‌గా, రేఖా బొగ్గారపు కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన దండోరా మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
దండోరా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి దండోరా చిత్రానికి 5 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా దర్శక నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రూరల్ ఏరియాలలో పూర్తి గ్రామీణ వాతావరణంలో దండోరా చిత్రం చిత్రీకరణ జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలకు తోడు.. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలతో దండోరా సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా, శివాజీ కామెంట్స్‌పైనే చర్చ జరుగుతోంది.
దండోరా బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంత?
దండోరా మూవీకి సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం శివాజీ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 6 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని అంచనా వేస్తున్నారు.
దండోరా తొలిరోజు కలెక్షన్స్
దండోరా మూవీకి డిసెంబర్ 24వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. తొలి రోజు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో బుకింగ్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ డే సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు శివాజీ మూవీకి ఇండియాలో 40 లక్షల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. ప్రీమియర్స్‌తో కలిపి తొలిరోజు దండోరా మూవీకి 1.50 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే అవతార్ 3, దురంధర్, ఛాంపియన్, ఈషా, శంబాల వంటి సినిమాల మధ్యలో దండోరా ఏ మేరకు నిలబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











