Raayan 11 Days Collections: రాయన్ మరో సంచలనం.. 11 రోజుల్లో కోట్ల వర్షం.. తెలుగులో లాభం చూశారంటే!

ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోనూ ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒకడు. తనదైన శైలి యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. వరుసగా మూవీలు చేస్తూ వస్తున్నాడు. ఇలా ఇటీవలే 'రాయన్' అనే మూవీతో వచ్చాడు. దీనికి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా వసూళ్లు అదిరిపోయేలా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధనుష్ నటించిన 'రాయన్' మూవీ 11 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే లుక్కేయండి మరి!

రాయన్‌తో ధనుష్ డబుల్
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం చేసిన చిత్రమే 'రాయన్' (Raayan). దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రను పోషించాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు కీలక పాత్రలను పోషించారు.

Dhanush Starrer Raayan Movie 10 Days Worldwide Box Office Collections

రాయన్ సినిమాకు బిజినెస్
ధనుష్ నటించిన 'రాయన్' సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో ఇది ఆరంభంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.00 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 40 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 45.00 కోట్లు బిజినెస్‌ జరుపుకుంది.

Dhanush Starrer Raayan Movie 10 Days Worldwide Box Office Collections

11వ రోజు ఇలా.. మొత్తంగా
సౌతిండియన్ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'రాయన్' సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. అయితే, 11వ రోజు ఒక్కసారిగా డౌన్ అయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 లక్షలు వరకూ షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలుపుకుని రూ. 1.50 కోట్లు వసూలు చేసింది. ఇలా ఇప్పటికే రూ. 60 కోట్లు దాటింది.

More from Filmibeat

Read more about: raayan dhanush raayan collections
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X