Raayan 14 Days Collections: 46 కోట్లు రావాలి.. 2 వారాల్లో రికార్డు వసూళ్లు.. మరి తెలుగులో హిట్టా ఫట్టా?

సౌత్ ఇండియా నుంచి ఎంతో మంది హీరోలు పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒకడు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న అతడు.. వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. ఇలా ఇటీవలే 'రాయన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి అన్ని చోట్లా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో 'ధనుష్' రాయన్ 14 రోజుల బాక్సాఫీస్ వసూళ్లను మీరే చూడండి!

రాయన్‌గా ధనుష్ రచ్చ రచ్చ
ధనుష్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమానే 'రాయన్' (Raayan). సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రను పోషించాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Dhanush Starrer Raayan Movie 14 Days Worldwide Box Office Collections

రాయన్ సినిమాకు బిజినెస్
తమిళ స్టార్ హీరో ధనుష్ 'రాయన్' సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో ఇది ఆరంభంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.00 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 40 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 45.00 కోట్లు బిజినెస్‌ చేసింది.

14వ రోజు ఇలా.. మొత్తంగా
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'రాయన్' సినిమాకు 14వ రోజు రెస్పాన్స్ బాగా పడిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమా రూ. 8 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి మాత్రం రూ. 70 లక్షలు రాబట్టింది. ఇలా రెండు వారాల్లోనే ఈ చిత్రం హిట్ స్టేటస్‌తో పాటు రూ. 19 కోట్లు వరకూ లాభాలను అందుకుంది.

More from Filmibeat

Read more about: raayan dhanush raayan collections
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X