Raayan 2 Days Collections: ధనుష్ సూపర్ బ్యాటింగ్.. 2 రోజుల్లో కోట్ల సునామీ.. తెలుగు వసూళ్లు మాత్రం!
విలక్షణమైన నటనతో పాటు డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా రేంజ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ ధనుష్. ఇలా సుదీర్ఘ కాలంగా ఎన్నో రకాల సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు తన 50వ చిత్రంగా 'రాయన్'తో వచ్చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు టాక్ మంచిగా రావడంతో రెస్పాన్స్ కూడా భారీగానే వస్తోంది. దీంతో వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'రాయన్' మూవీ రెండు రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

రాయన్‌గా ఎంటరైన ధనుష్
తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'రాయన్' (Raayan). దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రలో నటించాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు కీలక పాత్రలను పోషించారు.
రాయన్ సినిమాకు బిజినెస్
ధనుష్ హీరోగా నటించడంతో పాటు తెరకెక్కించిన 'రాయన్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.00 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 40 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 45.00 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుంది.

2వ రోజు తెలుగు వసూళ్లు
మాస్ స్టోరీతో రూపొందిన 'రాయన్' సినిమాకు రెండో రోజు కూడా రెస్పాన్స్ భారీగా లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 60 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రూ. 1.08 కోట్లు షేర్, రూ. 2.10 కోట్లు గ్రాస్ వచ్చింది.
2 రోజుల్లో తెలుగు వసూళ్లు
ధనుష్ తీసిన 'రాయన్' మూవీ ఆంధ్రా, తెలంగాణలో రెండు రోజుల్లో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 1.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 27 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రూ. 2.44 కోట్లు షేర్, రూ. 4.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'రాయన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో రెండు రోజుల్లో తెలుగులో రూ. 4.70 కోట్లు, తమిళంలో రూ. 22.15 కోట్లు, కర్నాటకలో రూ. 3.95 కోట్లు, కేరళలో రూ. 1.75 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.65 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 44.30 కోట్లు గ్రాస్, రూ. 21.40 కోట్లు షేర్ వచ్చింది.
మూవీ హిట్ అవ్వాలంటే?
'రాయన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల బిజినెస్ చేసుకుని రూ. 46 కోట్లు షేర్ టార్గెట్‌తో వచ్చింది. ఇది 2 రోజుల్లో రూ. 21.40 కోట్లు రాబట్టింది. అంటే.. ఇంకా 24.60 కోట్లు వసూలు చేయాలి. అలాగే, తెలుగులో రూ. 5 కోట్లు బిజినెస్.. రూ. 5.50 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. 2 రోజుల్లో ఇది రూ. 2.44 కోట్లు రాబట్టడంతో ఇంకా రూ. 3.06 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











