Raayan 4 Days Collections: రాయన్‌కు బిగ్ షాక్.. అయినా అన్ని కోట్లతో అరాచకం.. తెలుగు వసూళ్లు చూశారంటే!

ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ఎన్నో భాషల్లో స్టార్లు హీరోలు ఉన్నారు. కానీ, దేశం మొత్తంలో గుర్తింపును, మార్కెట్‌ను పొందిన హీరోలు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒకడు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న అతడు.. ఇటీవలే 'రాయన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం చక్కని ప్రదర్శన చేస్తోంది. అయితే, సోమవారం మాత్రం ఒక్కసారిగా డౌన్ అయింది. ఈ నేపథ్యంలో 'రాయన్' మూవీ 4 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!

రాయన్‌గా ధనుష్ అరాచకం
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రమే 'రాయన్' (Raayan). దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రను పోషించాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు కీలక పాత్రలు చేశారు.

Dhanush Starrer Raayan Movie 4 Days Worldwide Box Office Collections

రాయన్ సినిమాకు బిజినెస్
ధనుష్ 'రాయన్' మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.00 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 40 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 45.00 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.

4వ రోజు డౌన్.. మొత్తం ఇలా
తమిళ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'రాయన్' మూవీకి నాలుగో రోజు రెస్పాన్స్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా రూ. 45 లక్షలు షేర్ మాత్రమే రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలుపుకుని రూ. 3.75 కోట్లు వసూలు చేసింది. ఇలా నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ. 39 కోట్లకు పైగా షేర్‌ను కలెక్ట్ చేసుకుంది.

More from Filmibeat

Read more about: raayan dhanush raayan collections
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X