Raayan 6 Days Collections: షాకిచ్చేలా రాయన్ కలెక్షన్లు.. అప్పుడే టార్గెట్‌కు చేరువ.. తెలుగులో ఎంతంటే!
వైవిధ్యమైన నటనతో పాటు కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ ఇండియా మొత్తంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఇలా ఈ మధ్య కాలంలో డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తోన్న అతడు.. ఇటీవలే 'రాయన్' అనే ఫ్యామిలీ అండ్ మాస్ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయేలా స్పందన లభిస్తోంది. ఫలితంగా దీనికి వసూళ్లు భారీగా దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో 'రాయన్' మూవీ 6 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి మరి!
రాయన్‌గా ధనుష్ వచ్చాడు
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్ర నటించి, తెరకెక్కించిన సినిమానే 'రాయన్' (Raayan). దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రను పోషించాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు కీలక పాత్రలను పోషించారు.

రాయన్ సినిమాకు బిజినెస్
ధనుష్ నటించిన 'రాయన్' మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.00 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 40 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 45.00 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుంది.
6వ రోజు ఇలా.. మొత్తంగా
ధనుష్ హీరోగా నటించి, రూపొందించిన 'రాయన్' సినిమాకు వర్కింగ్ డేస్‌లో రెస్పాన్స్ క్రమంగా డౌన్ అవుతోంది. అయినప్పటికీ 6వ రోజు ఇది మంచి స్పందనను అందుకుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 2.00 కోట్లు వసూలు చేసింది. ఇలా 6 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 44 కోట్లు వరకూ రాబట్టి టార్గెట్‌కు చేరువ అయింది.


Click it and Unblock the Notifications











