Raayan 7 Days Collections: వారంలోనే టార్గెట్ ఔట్.. రికార్డు కొట్టిన ధనుష్.. తెలుగులో మాత్రం భిన్నంగా!
విలక్షణమైన యాక్టింగ్‌తో పాటు డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ దేశంలోనే గొప్ప నటుల్లో ఒకడిగా సత్తా చాటుతోన్నాడు కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. గత వారంలోనే 'రాయన్' అనే ఫ్యామిలీ అండ్ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి అదిరిపోయేలా స్పందన లభిస్తోంది. ఫలితంగా దీనికి వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'రాయన్' మూవీ 7 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!
రాయన్‌గా ధనుష్ ఎంటర్
కోలీవుడ్ సెన్సేషన్ ధనుష్ హీరోగా చేసి, దర్శకత్వం వహించిన చిత్రమే 'రాయన్' (Raayan). సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రను పోషించాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు కీలక పాత్రలను పోషించారు. దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశారు.

రాయన్ సినిమాకు బిజినెస్
ధనుష్ హీరోగా చేసిన 'రాయన్' మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.00 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 40 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 45.00 కోట్లు బిజినెస్‌ను చేసుకుంది.
7వ రోజు ఇలా.. మొత్తంగా
తమిళ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా నటించడంతో పాటు తెరకెక్కించిన 'రాయన్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి స్పందన కూడా లభిస్తోంది. అయితే, ఏడో రోజు మాత్రం ఈ చిత్రానికి రెస్పాన్స్ కాస్త డౌన్ అయింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమా రూ. 28 లక్షలు షేర్ రాబట్టింది. అలాగే, రూ. 55 లక్షలు గ్రాస్‌ను కూడా సొంతం చేసుకుంది.
7 రోజుల్లో తెలుగు వసూళ్లు
ధనుష్ 'రాయన్' మూవీ ఆంధ్రా, తెలంగాణలో ఏడు రోజుల్లో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 2.63 కోట్లు, సీడెడ్‌లో రూ. 58 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 58 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 38 లక్షలు, కృష్ణాలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో.. రూ. 5.22 కోట్లు షేర్, రూ. 9.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'రాయన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో ఏడు రోజుల్లో తెలుగులో రూ. 9.90 కోట్లు, తమిళంలో రూ. 48.35 కోట్లు, కర్నాటకలో రూ. 6.75 కోట్లు, కేరళలో రూ. 3.65 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 29.05 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 100.20 కోట్లు గ్రాస్, రూ. 47.80 కోట్లు షేర్ వచ్చింది.
మూవీకి లాభం ఎంతంటే
'రాయన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల బిజినెస్ చేసుకుని రూ. 46 కోట్లు షేర్ టార్గెట్‌తో వచ్చింది. ఇది 7 రోజుల్లో రూ. 47.80 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.80 కోట్లు లాభాలు తెచ్చుకుంది. అలాగే, తెలుగులో రూ. 5 కోట్లు బిజినెస్.. రూ. 5.50 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. 7 రోజుల్లో ఇది రూ. 5.22 కోట్లు రాబట్టడంతో ఇంకా రూ. 28 లక్షలు వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











