Raayan 8 Days Collections: తెలుగులో ధనుష్ సంచలనం.. కోట్ల టార్గెట్ ఔట్.. మొత్తం లాభం ఎంతో తెలిస్తే!

పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా దేశ వ్యాప్తంగా మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో దూసుకుపోతోన్నాడు ధనుష్. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేసే అతడు.. ఇటీవలే 'రాయన్' అనే క్రేజీ సినిమాతో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఊహించని స్పందనను అందించారు. ఫలితంగా దీనికి వసూళ్లు భారీగానే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'రాయన్' మూవీ 8 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి మరి!

రాయన్‌గా ధనుష్ అరాచకం
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించి, రూపొందించిన చిత్రమే 'రాయన్' (Raayan). సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రను పోషించాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు కీలక పాత్రలను పోషించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

Dhanush Starrer Raayan Movie 8 Days Worldwide Box Office Collections

రాయన్ సినిమాకు బిజినెస్
ధనుష్ హీరోగా నటించిన 'రాయన్' మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.00 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 40 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 45.00 కోట్లు బిజినెస్‌ జరుపుకుంది.

8వ రోజు ఇలా.. మొత్తంగా
తమిళ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'రాయన్' సినిమాకు 8వ రోజు కూడా మంచి స్పందనే లభించింది. ఫలితంగా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 25 లక్షలు వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 2.00 కోట్లు రాబట్టింది. ఇలా మొత్తంగా రూ. 49 కోట్లు వరకూ సాధించింది. ముఖ్యంగా తెలుగులో ఈ చిత్రం టార్గెట్‌ను చేరుకుంది.

More from Filmibeat

Read more about: raayan dhanush raayan collections
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X