Raayan 9 Days Collections: కుమ్మేసిన ధనుష్ రాయన్.. లాభాలతో సెన్సేషన్.. తెలుగులో ఎన్ని కోట్లంటే!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి దర్శకత్వంలోనూ రాణిస్తోన్న హీరోలు ఇండియాలో చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ ఒకడు. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను అందించిన అతడు.. ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో 'రాయన్' అనే క్రేజీ సినిమాను చేశాడు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందించారు. ఫలితంగా దీనికి వసూళ్లు అదిరిపోయేలా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'రాయన్' మూవీ 9 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే లుక్కేయండి!
రాయన్‌గా ధనుష్ విశ్వరూపం
తమిళ స్టార్ ధనుష్ హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన సినిమానే 'రాయన్' (Raayan). సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రను పోషించాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు కీలక పాత్రలను పోషించారు. దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

రాయన్ సినిమాకు బిజినెస్
ధనుష్ నటించిన 'రాయన్' మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో ఇది ఆరంభంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.00 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 40 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 45.00 కోట్లు బిజినెస్ చేసుకుంది.

9వ రోజు ఇలా.. మొత్తంగా
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'రాయన్' సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. ఇలా ఈ చిత్రం తొమ్మిదో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 35 లక్షలు వరకూ షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలుపుకుని రూ. 3.00 కోట్లు వసూలు చేసింది. ఇలా ఇప్పటికే ఈ చిత్రం తెలుగు, తమిళంలో లాభాలను అందుకుంటోంది.


Click it and Unblock the Notifications











