Raayan Closing Collections: ధనుష్ రాయన్ ఫైనల్ కలెక్షన్లు.. తెలుగులో అలా మొత్తంగా ఇలా.. అసలు లెక్కలు ఇవే!
గతంలో కంటే ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా స్టార్లు ఎక్కువగా తయారవుతున్నారు. కానీ, చాలా కాలంగా ఇదే రేంజ్‌లో సత్తా చాటుతున్న వాళ్లు కొందరు ఉన్నారు. అందులో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒకడు. విలక్షణమైన నటనతో ఎంతో పేరు తెచ్చుకున్న అతడు.. విభిన్నమైన చిత్రాలతో వస్తున్నాడు. ఇలా ఇటీవలే 'రాయన్' అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. దీనికి అన్ని చోట్లా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంది. ఈ నేపథ్యంలో రాయన్ బాక్సాఫీస్ రిపోర్ట్‌ను మీరే చూడండి!
రాయన్‌గా ధనుష్ అరాచకం
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించి, తెరకెక్కించిన సినిమానే 'రాయన్' (Raayan). సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రను పోషించాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌ను సమకూర్చారు.

రాయన్ సినిమాకు బిజినెస్
తమిళ హీరో ధనుష్ 'రాయన్' సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో ఇది ఆరంభంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.00 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలు కలిపి రూ. 40 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 45.00 కోట్లు బిజినెస్ జరిగింది.
అలాంటి టాక్‌తో భారీగానే
సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న ధనుష్ హీరోగా నటించడంతో పాటు తెరకెక్కించిన 'రాయన్' సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే, మొదటి రోజు ఈ చిత్రానికి టాక్ అనుకున్న విధంగా దక్కలేదు. కానీ, రెస్పాన్స్ మాత్రం భారీ స్థాయిలోనే వచ్చింది. అలా ఈ సినిమా తనదైన రీతిలో హవాను చూపించి అదిరిపోయే వసూళ్లు సాధించింది.

రాయన్ తెలుగు వసూళ్లు
ధనుష్ 'రాయన్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 3.44 కోట్లు, సీడెడ్‌లో రూ. 85 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 81 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 55 లక్షలు, కృష్ణాలో రూ. 52 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలతో.. రూ. 7.28 కోట్లు షేర్, రూ. 14.55 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'రాయన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో ఫుల్ రన్‌లో తెలుగులో రూ. 14.55 కోట్లు, తమిళంలో రూ. 78.10 కోట్లు, కర్నాటకలో రూ. 10.35 కోట్లు, కేరళలో రూ. 5.85 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 43.00 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 155.25 కోట్లు గ్రాస్, రూ. 73.75 కోట్లు షేర్ వచ్చింది.

మూవీకి లాభం ఎంతంటే
'రాయన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల బిజినెస్ చేసుకుని రూ. 46 కోట్లు షేర్ టార్గెట్‌తో వచ్చింది. ఇది ఫుల్ రన్‌లో రూ. 73.75 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 27.75 కోట్లు లాభాలు తెచ్చుకుంది. అలాగే, తెలుగులో రూ. 5 కోట్లు బిజినెస్.. రూ. 5.50 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. ఇది రూ. 7.28 కోట్లు రాబట్టడంతో రూ. 1.78 కోట్లు లాభాలు అందుకుంది.


Click it and Unblock the Notifications











