Raayan Day 1 Collections: ధనుష్ మూవీకి తొలి రోజే అన్ని కోట్లు.. తెలుగులో ఆ హీరోలతో సమానంగా!
దక్షిణాది మొత్తంలో చాలా మందే స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ధనుష్ ఒకడు. ఆరంభం నుంచీ విలక్షణమైన నటనతో సత్తా చాటుతోన్న అతడు.. వరుసగా మూవీలు చేస్తూ వస్తున్నాడు. ఇలా ఇప్పుడు 'రాయన్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చేశాడు. దీనికి డీసెంట్ టాక్ రావడంతో ఫస్ట్ డే భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఇది కలెక్షన్లను రాబట్టింది. మరి 'రాయన్' ఫస్ట్ డే రిపోర్టును మీరే చూడండి!
రాయన్‌గా వచ్చేసిన ధనుష్
కోలీవుడ్ బడా స్టార్ ధనుష్ నటించి, తెరకెక్కించిన సినిమానే 'రాయన్' (Raayan). సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రలో నటించాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు కీలక పాత్రలను పోషించారు. దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశారు.

రాయన్ సినిమాకు బిజినెస్
హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'రాయన్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.00 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 40 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 45.00 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది.
అలాంటి టాక్.. రెస్పాన్స్‌తో
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ధనుష్ 'రాయన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాకే వచ్చింది. అందుకు ఏమాత్రం సరిపోని విధంగా దీనికి రెస్పాన్స్ మంచిగా వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన కలెక్షన్లు తక్కువగా వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్లే ఫస్ట్ డేనే డల్ కలెక్షన్లను రాబట్టింది.
తొలి రోజు తెలుగు వసూళ్లు
'రాయన్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రోజు సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 60 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రూ. 1.26 కోట్లు షేర్, రూ. 2.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'రాయన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో మొదటి రోజు తెలుగులో రూ. 2.20 కోట్లు, తమిళంలో రూ. 10.80 కోట్లు, కర్నాటకలో రూ. 1.85 కోట్లు, కేరళలో రూ. 95 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 55 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 5.10 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.45 కోట్లు గ్రాస్, రూ. 10.30 కోట్లు షేర్ వచ్చింది.
మూవీ హిట్ అవ్వాలంటే?
'రాయన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల బిజినెస్ చేసుకుని రూ. 46 కోట్లు షేర్ టార్గెట్‌తో వచ్చింది. ఇది ఫస్ట్ డే రూ. 10.30 కోట్లు రాబట్టింది. అంటే.. ఇంకా 35.60 కోట్లు వసూలు చేయాలి. అలాగే, తెలుగులో రూ. 5 కోట్లు బిజినెస్.. రూ. 5.50 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. ఫస్ట్ డే ఇది రూ. 1.26 కోట్లు రాబట్టడంతో ఇంకా రూ. 4.24 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











