Raayan: ధనుష్ సినిమాకు తెలుగులో భారీ బిజినెస్.. రాయన్‌కు ఎన్ని కోట్లు వస్తే హిట్ అంటే?
తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన హీరోనే అయినా దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు విలక్షణ నటుడు ధనూష్. అదే సమయంలో చాలా దేశాల్లో కూడా క్రేజ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఈ మధ్యన చాలా ప్రయోగాలు చేస్తోన్న ధనూష్ 'రాయన్' అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీని స్వీయ దర్శకత్వంలో తీసుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేసింది అనే వివరాలను తెలుసుకుందాం పదండి!
రాయన్ అంటూ వస్తున్నాడు
కోలీవుడ్ సూపర్ స్టార్ ధనూష్ నటించి, తెరకెక్కించిన సినిమానే 'రాయన్' (Raayan). సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రలో నటించాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు కీలక పాత్రలను పోషించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

అలాంటి కథ.. మాస్ ట్రీట్
నార్త్ మద్రాసు నగరంలో జరిగే కథతో రూపొందిన చిత్రమే 'రాయన్'. కుటుంబ విలువలతో కూడిన మాస్ ట్రీట్‌మెంట్‌తో దీన్ని రూపొందించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని తెరకెక్కించారు. అంతేకాదు, తమిళంతో పాటు తెలుగులోనూ దీన్ని తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
ప్రమోషన్స్‌తో సందడిగా
ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ మాస్ స్టోరీతో రూపొందిన 'రాయన్' సినిమాను జూలై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీన్ని తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా తీసుకు రాబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లు, ఇంటర్వ్యూలు కూడా జరిగాయి.

రాయన్‌కు భారీ బిజినెస్
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటుడు ధనూష్ దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించిన 'రాయన్' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు తెలుగులోనూ పోటీ ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమాకు రూ. 4.50 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అన్ని కోట్లు వస్తేనే హిట్
ధనూష్ నటించిన 'రాయన్' మూవీకి బిజినెస్ ఊహించని స్థాయిలోనే జరిగింది. ఇక, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఏరియాల్లో కలిపి ఊహించని విధంగా రూ. 4.50 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.00 కోట్లుగా నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











