SIR 11 Days Collections: 11వ రోజూ భారీగా.. త్రివిక్రమ్‌ జాక్‌పాట్.. అన్ని కోట్ల లాభాలతో రికార్డు

కోలీవుడ్ నుంచి హీరోగా వచ్చినా దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకోవడంతో పాటు హాలీవుడ్ చిత్రాల్లో నటించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు ధనూష్. విభిన్నమైన సబ్జెక్టులతో సినిమాలు చేస్తూ తనదైన నటనతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఇప్పుడు నేరుగా తెలుగులో 'సార్' (తమిళంలో వాతి) అనే చిత్రంలో నటించాడు.

దీనికి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన వస్తూనే ఉంది. దీంతో కలెక్షన్లు కూడా ఓ రేంజ్‌లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధనూష్ నటించిన సార్ మూవీ 11 రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందో మీరే చూసేయండి మరి!

 సార్‌గా ఎంట్రీ ఇచ్చిన ధనూష్

సార్‌గా ఎంట్రీ ఇచ్చిన ధనూష్

తమిళ స్టార్ హీరో ధనూష్ నటించిన తాజా చిత్రమే 'సార్' (తమిళంలో వాతి). వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ సంగీతం ఇచ్చాడు. చాలా మంది స్టార్లు ఇందులో నటించారు.

సార్ మూవీ బిజినెస్ వివరాలు

సార్ మూవీ బిజినెస్ వివరాలు

'సార్' మూవీపై ఆరంభం నుంచీ నెలకొన్న అంచనాలతో పాటు ధనూష్ రేంజ్‌కు తగ్గట్లుగానే.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేశారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 35 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 11వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా

11వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా

ధనూష్ నటించిన 'సార్' చిత్రానికి 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 23 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 10 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రూ. 59 లక్షలు షేర్, రూ. 1.05 కోట్లు గ్రాస్ వసూలైంది.

11 రోజులకూ కలిపి ఎంతంటే?

11 రోజులకూ కలిపి ఎంతంటే?

'సార్' చిత్రానికి 11 రోజుల్లో నైజాంలో రూ. 6.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.26 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.23 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.44 కోట్లు, వెస్ట్‌లో రూ. 62 లక్షలు, గుంటూరులో రూ. 1.20 కోట్లు, కృష్ణాలో రూ. 1.02 కోట్లు, నెల్లూరులో రూ. 58 లక్షలు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లతో కలిపి తెలుగులో రూ. 17.00 కోట్లు షేర్, రూ. 32.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

తెలుగులో అన్ని కోట్ల లాభం

తెలుగులో అన్ని కోట్ల లాభం

కోలీవుడ్ స్టార్ ధనూష్ నటించిన 'సార్' మూవీకి తెలుగు వెర్షన్‌కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి రూ. 6.70 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. ఇక, ఈ సినిమా 11 రోజుల్లోనే రూ. 17.00 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10.30 కోట్లు లాభాల మార్కు చేరి రికార్డును సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

సందేశాత్మకంగా వచ్చిన 'సార్' తమిళ వెర్షన్‌కు కూడా బానే వసూళ్లు వచ్చాయి. దీంతో 11 రోజుల్లో తమిళనాడులో రూ. 30.63 కోట్లు, కర్నాటకలో రూ. 7.02 కోట్లు, కేరళలో రూ. 98 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.02 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 20.05 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 11 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 89.16 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 46.30 కోట్లు వరకూ షేర్‌ దక్కింది.

ఓవరాల్‌గా ఎంత లాభం అంటే

ఓవరాల్‌గా ఎంత లాభం అంటే

'సార్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో ఓవరాల్‌గా దీనికి రూ. 36 కోట్లు ప్రీ రిలీజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నమోదైంది. అయితే, ఈ చిత్రానికి 11 రోజుల్లో రూ. 46.30 కోట్లు షేర్ వచ్చింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు రూ. 10.30 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X