SIR 13 Days Collections: ధనుష్ మూవీ క్లిక్కయితే ప్రాఫిట్స్ ఈ స్థాయిలో ఉంటాయి.. నిర్మాతలకు పండగే!

టాలెంటెడ్ నటుడుగా మంచి గుర్తింపును అందుకున్న ధనుష్ తెలుగులో ఎప్పటినుంచో కూడా బిగ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక మొత్తానికి వెంకీ దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమాతో అతనికి తెలుగులో మంచి క్రేజ్ అయితే దక్కింది. ఈ సినిమా పెట్టిన పెట్టుబడిన మొత్తం మొదటి వారంలోనే వెనక్కి తేవడమే కాకుండా ఇప్పుడు నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ అందిస్తోంది. ఇక సార్ సినిమా మొత్తం 13 రోజుల్లో ఎంత ప్రాఫిట్స్ అందించింది అనే వివరాల్లోకి వెళితే..

రేంజ్ కు తగ్గట్టుగా బిజినెస్

రేంజ్ కు తగ్గట్టుగా బిజినెస్

తొలిప్రేమ మిస్టర్ మజ్ను సినిమాలతో మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి సార్/వాతి సినిమాను తెలుగు తమిళంలో ఒకేసారి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ అలాగే త్రివిక్రమ్ తన హోమ్ ప్రొడక్షన్లో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 35 కోట్ల బిజినెస్ చేసింది.

13వ రోజు ఏపీ నైజాం కలెక్షన్స్

13వ రోజు ఏపీ నైజాం కలెక్షన్స్

మొదటి వారంలోనే సాలీడ్ కలెక్షన్స్ అందుకున్న సార్ సినిమా రెండవ వారంలో పరవాలేదు అనేలా నెంబర్స్ ను పెంచుకుంది. ఇక 13వ రోజు ధనూష్ నటించిన 'సార్' చిత్రానికి వసూళ్లు తగ్గిపోయాయి. ఇక నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 38 లక్షలు షేర్, రూ. 78 లక్షలు గ్రాస్ వసూలైంది.

13 రోజుల తెలుగు కలెక్షన్స్

13 రోజుల తెలుగు కలెక్షన్స్

'సార్' సినిమా 13 రోజుల్లో నైజాంలో రూ. 6.72 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.32 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.31 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.48 కోట్లు, వెస్ట్‌లో రూ. 64 లక్షలు, గుంటూరులో రూ. 1.23 కోట్లు, కృష్ణాలో రూ. 1.06 కోట్లు, నెల్లూరులో రూ. 60 లక్షలు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.26 కోట్లతో కలిపి తెలుగులో రూ. 18.48 కోట్లు షేర్, రూ. 34.02 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

తెలుగులో వచ్చిన ప్రాఫిట్

తెలుగులో వచ్చిన ప్రాఫిట్

టాలెంటెడ్ హీరో ధనూష్ 'సార్' సినిమా తెలుగు వెర్షన్‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక తెలుగులో టోటల్ గా రూ. 6.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇక సార్ టోటల్ గా రూ. 6.70 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అయితే సినిమా 13 రోజుల్లోనే రూ. 18.48 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. ఇక హిట్ స్టేటస్‌తో పాటు రూ. 11.78 కోట్లు లాభాల మార్కు చేరి రికార్డును సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

'సార్' సినిమా తమిళ వెర్షన్‌ లో కూడా మంచి వసూళ్ళను రాబట్టింది. ఇక 13 రోజుల్లో తమిళనాడులో సార్ సినిమా రూ. 32.50 కోట్లు, కర్నాటకలో రూ. 7.40 కోట్లు, కేరళలో రూ. 1.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.12 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 21.60 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 13 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 93.69 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 49.62 కోట్లు వరకూ షేర్‌ దక్కింది.

ఫైనల్ గా సార్ లాభాలు ఎంతంటే..

ఫైనల్ గా సార్ లాభాలు ఎంతంటే..


ఇక 'సార్' సినిమా అంచనాలకు తగ్గట్టుగానే తెలుగు తమిళంలో మంచి బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ చేయగా.. ఇక ఓవరాల్‌గా రూ.36 కోట్లు ప్రీ రిలీజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ ఫిక్స్నయ్యింది. ఇక సార్ చిత్రానికి 13 రోజుల్లో రూ. 49.62 కోట్లు షేర్ వచ్చింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు దాదాపు రూ. 12.62 కోట్ల వరాలు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X