SIR 2 Weeks Collections: రెండు సినిమాలతో వచ్చిన నష్టాలను ధనుష్ తీర్చేశాడుగా.. వాళ్ళకు ఎన్ని లాభాలో..
తమిళంలో మంచి నటుడిగా గుర్తింపును అందుకున్న స్టార్ హీరో ధనుష్ ఆ తర్వాత తెలుగులో కూడా చాలాసార్లు సక్సెస్ అందుకోవాలని అనుకున్నాడు. ఇక రఘువరన్ బీటెక్ సినిమాతో మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికీ మళ్లీ అదే ఫ్లోను కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక మొత్తానికి సార్ సినిమా అతని కోరికను నెరవేర్చింది. తెలుగు ఆడియన్స్ మంచి కంటెంట్ తో వస్తే సక్సెస్ ఇస్తారు అని సార్ సినిమా రుజువు చేసింది. ఇక ఈ సినిమా రెండు వారాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకోవడమే కాకుండా ఇంతకుముందు నిర్మాతలు పోగొట్టుకున్న డబ్బును కూడా వెనక్కు తెచ్చింది. ఇక మొత్తంగా సార్ సినిమా తెలుగు తమిళంలో ప్రపంచవ్యాప్తంగా 14 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ టార్గెట్
సితార ఎంటర్టైన్మెంట్స్ త్రివిక్రమ్ ఫార్చ్యూన్ ఫోర్ ప్రొడక్షన్ హౌస్ లు సంయుక్తంగా నిర్మించిన సార్ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా ఎడ్యుకేషన్ నేపథ్యంలో లో తెరపైకి వచ్చిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా స్థాయికి తగ్గట్టుగానే మంచి బిజినెస్ చేసింది. తెలుగులో 6 కోట్ల టార్గెట్ తో విడుదలైన సార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తమిళంలో కలిపి 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది.

14వ రోజు ఏపీ నైజాం కలెక్షన్స్
ఇక మొదటివారం లోనే కాకుండా రెండవ వారం కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సార్ సినిమాకు మౌత్ టాక్ ద్వారానే కలెక్షన్స్ పెరిగాయి. ఇక రెండవ వారం కూడా ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడంతో కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. ఇక 14వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 15 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 6 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 37 లక్షలు షేర్, రూ. 72 లక్షలు గ్రాస్ వసూలైంది.

14 రోజుల తెలుగు కలెక్షన్స్
'సార్' సినిమా 14 రోజుల్లో ఏపి తెలంగాణ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 6.74 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.37 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.37 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.51 కోట్లు, వెస్ట్‌లో రూ. 66 లక్షలు, గుంటూరులో రూ. 1.25 కోట్లు, కృష్ణాలో రూ. 1.09 కోట్లు, నెల్లూరులో రూ. 61 లక్షలు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.27 కోట్లతో కలిపి తెలుగులో రూ. 16.59 కోట్లు షేర్, రూ. 31.02 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

తెలుగులో భారీగా లాభాలు
ధనూష్ 'సార్' సినిమా దాదాపు తెలుగు తమిళ్ లో ఓకే రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడం విశేషం. తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని లొకేషన్స్ లో విడుదల చేశారు. తెలుగులో టోటల్ గా రూ. 6.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేయగా.. టోటల్ గా రూ. 6.70 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ సెట్టయ్యింది. ఇక ఈ సినిమా 14 రోజుల్లోనే రూ. 17 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. ఇక హిట్ స్టేటస్‌తో పాటు రూ. 11.90 కోట్ల వరకు ప్రాఫిట్ అందుకుంది.

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్
'సార్' సినిమా రెండు వారాల్లో తమిళనాడులో రూ. 32.45 కోట్లు, కర్నాటకలో రూ. 7.40 కోట్లు, కేరళలో రూ. 1.06 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.12 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 21.60 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 14 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 93.70 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 49.80 కోట్లు వరకూ షేర్ దక్కింది.

మళ్ళీ లాభాల్లోకి సితార
ఇక 'సార్' సినిమా తెలుగు తమిళంలో మంచి బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 35 కోట్లు బిజినెస్ చేయగా.. రూ.36 కోట్లు ప్రీ రిలీజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సెట్ అయ్యింది. ఇక సార్ చిత్రానికి రెండు వారాల్లో రూ. 49.78 కోట్లు షేర్ వచ్చింది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంతకుముందు వరుసగా స్వాతిముత్యం, బుట్టబొమ్మ సినిమాలతో నష్టాలు రాగా సార్ సినిమా ఆ నష్టాలను పూరించేసింది. ఇక నిర్మాతల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు దాదాపు రూ. 12.62 కోట్ల వరాలు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











