SIR Movie Latest Collections: 16వ రోజు తెలుగులో మళ్ళీ పెరిగిన కలెక్షన్స్.. ధనుష్ ఖాతాలో మరో రికార్డ్!

అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా తనదైన శైలిలో ఆకట్టుకునే ధనుష్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఒక డిఫరెంట్ పాయింట్ ఉండేలా చూసుకుంటాడు ఇక ఈసారి చదువుకు సంబంధించిన ఒక మంచి సోషల్ ఎలిమెంట్తో సార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది ఇక 16వ రోజు కూడా ఈ సినిమాకు వీకెండ్ బాగా కలిసి వచ్చింది ఇక మొత్తంగా ఇప్పటివరకు సినిమా పెట్టిన పెట్టుబడికి ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్

ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ స్థాపించి వరుసగా సితార ఎంటర్టైన్మెంట్స్ తో సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక సార్ సినిమాను త్రివిక్రమ్ సలహాలు మేరకు కాస్త భారీ బడ్జెట్ తోనే నిర్మించారు.

ఇక ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి విడుదలయింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 6 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ తో విడుదలయింది. ఇక తమిళంలో వాతిగా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైంది.

16వ రోజు ఏపీ నైజాం కలెక్షన్స్

16వ రోజు ఏపీ నైజాం కలెక్షన్స్

సార్ సినిమా మూడవ వారం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో స్టార్ట్ చేసింది. సార్ సినిమాకు మౌత్ టాక్ ద్వారానే కలెక్షన్స్ పెరిగాయి. ఈ వారం కూడా సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడంతో కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. ఇక 16వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 39 లక్షలు షేర్, రూ. 72 లక్షలు గ్రాస్ వసూలైంది.

16 రోజుల తెలుగు కలెక్షన్స్

16 రోజుల తెలుగు కలెక్షన్స్

'సార్' సినిమా 16 రోజుల్లో ఏపి నైజాం కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 7.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.49 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.60 కోట్లు, వెస్ట్‌లో రూ. 74 లక్షలు, గుంటూరులో రూ. 1.31 కోట్లు, కృష్ణాలో రూ. 1.15 కోట్లు, నెల్లూరులో రూ. 63 లక్షలు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.28 కోట్లతో కలిపి తెలుగులో రూ. 17.32 కోట్లు షేర్, రూ. 35.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

 తెలుగులో వచ్చిన ప్రాఫిట్స్

తెలుగులో వచ్చిన ప్రాఫిట్స్

ధనూష్ నటించిన 'సార్' సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. తెలుగు వెర్షన్‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా కొన్ని లొకేషన్స్ లో బయ్యర్లకు లాభాలను అందించింది. తెలుగులో టోటల్ గా రూ. 6.20 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేయగా.. టోటల్ గా రూ. 6.70 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా 14 రోజుల్లోనే రూ. 17.32 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. ఇక హిట్ స్టేటస్‌తో పాటు రూ. 12 కోట్లకు పైగా ప్రాఫిట్ అందుకుంది.

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్

సార్/వాతి సినిమా రెండు వారాల్లో తమిళనాడులో రూ. 33.45 కోట్లు, కర్నాటకలో రూ. 7.45 కోట్లు, కేరళలో రూ. 1.07 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.12 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 21.90 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 14 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్‌తో పాటు రూ. 52.80 కోట్లు వరకూ షేర్‌ దక్కింది.

ధనుష్ సరికొత్త రికార్డ్

ధనుష్ సరికొత్త రికార్డ్

'సార్' సినిమా తెలుగు తమిళంలో రేంజ్ కు తగ్గట్టుగా మంచి బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ రూ.35 కోట్లు బిజినెస్ చేయగా.. రూ.36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ సెట్ అయ్యింది. ఇక సార్ రెండు వారాల్లో రూ. 52.80 కోట్లు షేర్ వచ్చింది. ధనుష్ కెరీర్ లో తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా బెస్ట్ నెంబర్స్ అందుకున్న సినిమాగా సార్ సినిమా నిలిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంతకుముందు వరుసగా స్వాతిముత్యం, బుట్టబొమ్మ సినిమాలతో నష్టాలు రాగా సార్ సినిమా ఆ నష్టాలను పూరించేసింది. దీంతో నిర్మాతలైన నాగవంశీ, త్రివిక్రమ్ కు దాదాపు రూ. 14.62 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X