SIR 17 Days Collections: సండే సంచలన వసూళ్లు.. నక్కతోక తొక్కిన త్రివిక్రమ్.. లాభాలతో నయా రికార్డు
తెలుగు సినిమా స్థాయి అంతకంతకూ పెరుగుతుండడంతో ఇక్కడ నేరుగా మూవీలు చేయడానికి ఎంతో మంది వేరే ఇండస్ట్రీల హీరోలు ముందుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనూష్ టాలీవుడ్‌లో 'సార్' అనే మూవీలో నటించిన విషయం తెలిసిందే. తమిళంలో వాతి అనే వచ్చిన ఈ సినిమాకు భారీ స్పందన వస్తూనే ఉంది. దీంతో కలెక్షన్లు కూడా అత్యధికంగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధనూష్ నటించిన సార్ మూవీ 17 రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందో మీరే చూసేయండి మరి!

సార్‌గా ఎంట్రీ ఇచ్చిన ధనూష్
కోలీవుడ్ స్టార్ ధనూష్ నటించిన తాజా చిత్రమే 'సార్' (తమిళంలో వాతి). వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ సంగీతం ఇచ్చాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలు చేశారు.

సార్ మూవీ బిజినెస్ వివరాలు
సందేశాత్మక కథతో రూపొందిన 'సార్' మూవీపై ఆరంభం నుంచీ నెలకొన్న అంచనాలతో పాటు ధనూష్ రేంజ్‌కు తగ్గట్లుగానే.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేశారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 35 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.

17వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా
17వ రోజు ధనూష్ నటించిన 'సార్' చిత్రానికి వసూళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 16 లక్షలు, ఈస్ట్‌లో రూ. 8 లక్షలు, వెస్ట్‌లో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 96 లక్షలు షేర్, రూ. 1.95 కోట్లు గ్రాస్ వసూలైంది.

17 రోజులకూ కలిపి ఎంతంటే?
'సార్' చిత్రానికి 17 రోజుల్లో నైజాంలో రూ. 7.53 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.66 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.69 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.70 కోట్లు, వెస్ట్‌లో రూ. 77 లక్షలు, గుంటూరులో రూ. 1.40 కోట్లు, కృష్ణాలో రూ. 1.24 కోట్లు, నెల్లూరులో రూ. 69 లక్షలు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లతో కలిపి తెలుగులో రూ. 20.03 కోట్లు షేర్, రూ. 38.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

తెలుగులో అన్ని కోట్ల లాభం
తమిళ స్టార్ ధనూష్ నటించిన 'సార్' మూవీకి తెలుగు వెర్షన్‌కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి రూ. 6.70 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. ఇక, ఈ సినిమా 17 రోజుల్లోనే రూ. 20.03 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 13.33 కోట్లు లాభాల మార్కు చేరి రికార్డును సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
తెలుగులో దుమ్ము దులిపిన ధనూష్ 'సార్' మూవీ.. 17 రోజుల్లో తమిళనాడులో రూ. 35.85 కోట్లు, కర్నాటకలో రూ. 7.70 కోట్లు, కేరళలో రూ. 1.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.11 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 23.05 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇలా మొత్తంగా 17 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 103.86 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 53.99 కోట్లు షేర్‌తో రికార్డు కొట్టింది.

ఓవరాల్‌గా ఎంత లాభం అంటే
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'సార్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో ఓవరాల్‌గా దీనికి రూ. 36 కోట్లు ప్రీ రిలీజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నమోదైంది. అయితే, ఈ చిత్రానికి 17 రోజుల్లో రూ. 53.99 కోట్లు షేర్ వచ్చింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు రూ. 17.99 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











