SIR 19 Days Collections: మళ్లీ కలెక్షన్లు డబుల్.. అన్ని కోట్ల లాభాలతో రికార్డు.. మరో 48లక్షలు వస్తే!
సుదీర్ఘ కాలంగా కోలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేస్తూ.. ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు ధనూష్. అలాగే, బాలీవుడ్, హాలీవుడ్ మూవీల్లో కూడా నటించి తన రేంజ్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్నాడు. ఇలా ఇప్పుడు ధనూష్ నేరుగా తెలుగులో 'సార్' అనే సినిమాను చేశాడు.
తమిళంలో 'వాతి' అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాకు ప్రపం వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో ధనూష్ నటించిన సార్ మూవీ 19 రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందో మీరే చూసేయండి!

‘సార్'గా కనిపించిన ధనూష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనూష్ నటించిన తాజా చిత్రమే 'సార్' (తమిళంలో వాతి). వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ సంగీతం ఇచ్చాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు భాగం అయ్యారు.

సార్ మూవీ బిజినెస్ వివరాలు
చదువు గొప్పదనాన్ని వివరిస్తూ తెరకెక్కించిన 'సార్' మూవీపై ఆరంభం నుంచీ నెలకొన్న అంచనాలతో పాటు ధనూష్ రేంజ్‌కు తగ్గట్లుగానే.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేశారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయింది.

19వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా
19వ రోజు ధనూష్ నటించిన 'సార్' చిత్రానికి వసూళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 13 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 77 లక్షలు షేర్, రూ. 1.45 గ్రాస్ వసూలైంది.
భూమిక ఎద అందాల ఆరబోత: ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలా చూపించలేదుగా!
https://telugu.filmibeat.com/heroine/actress-bhumika-chawlain-latest-sizzling-pic-goes-viral-117870.html

19 రోజులకూ కలిపి ఎంతంటే?
'సార్' చిత్రానికి 19 రోజుల్లోనైజాంలో రూ. 7.99 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.82 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.88 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.81 కోట్లు, వెస్ట్‌లో రూ. 82 లక్షలు, గుంటూరులో రూ. 1.48 కోట్లు, కృష్ణాలో రూ. 1.32 కోట్లు, నెల్లూరులో రూ. 72 లక్షలు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.38 కోట్లతో కలిపి తెలుగులో రూ. 21.22 కోట్లు షేర్, రూ. 40.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

తెలుగులో అన్ని కోట్ల లాభం
తమిళ టాలెంటెడ్ హీరో ధనూష్ నటించిన 'సార్' మూవీకి తెలుగు వెర్షన్‌కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి రూ. 6.70 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. ఇక, ఈ సినిమా 19 రోజుల్లోనే రూ. 21.22 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 14.52 కోట్లు లాభాలతో రికార్డును సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన 'సార్' మూవీ.. 19 రోజుల్లో తమిళనాడులో రూ. 37.40 కోట్లు, కర్నాటకలో రూ. 7.80 కోట్లు, కేరళలో రూ. 1.12 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 23.70 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇలా మొత్తంగా 19 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 108.39 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 56.33 కోట్లు షేర్‌తో రికార్డు కొట్టింది.

ఓవరాల్‌గా ఎంత లాభం అంటే
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'సార్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో ఓవరాల్‌గా దీనికి రూ. 36 కోట్లు ప్రీ రిలీజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నమోదైంది. అయితే, ఈ చిత్రానికి 19 రోజుల్లో రూ. 56.33 కోట్లు షేర్ వచ్చింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు రూ. 20.33 కోట్లు లాభాలతో రికార్డు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











