SIR 24 Days Collections: కలిసొచ్చిన సండే.. 24వ రోజూ భారీగా.. త్రివిక్రమ్‌కు లాభం ఎన్ని కోట్లంటే!

పేరుకు కోలీవుడ్‌కు చెందిన హీరోనా అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు ధనూష్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తోన్న అతడు.. తన రేంజ్‌ను భారీగా పెంచుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నేరుగా తెలుగులో 'సార్' అనే సినిమాను చేశాడు. తమిళంలో 'వాతి' అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన వస్తోంది. దీంతో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధనూష్ సార్ మూవీ 24 రోజుల రిపోర్టును చూడండి!

సార్‌గా ఎంట్రీ ఇచ్చిన ధనూష్

సార్‌గా ఎంట్రీ ఇచ్చిన ధనూష్

కోలీవుడ్ స్టార్ ధనూష్ నటించిన తాజా చిత్రమే ‘సార్' (తమిళంలో వాతి). వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ సంగీతం ఇచ్చాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు కనిపించారు.

సార్ మూవీ బిజినెస్ వివరాలు

సార్ మూవీ బిజినెస్ వివరాలు


సందేశాత్మకమైన కథతో రూపొందిన ‘సార్' మూవీపై ఆరంభం నుంచీ నెలకొన్న అంచనాలతో పాటు ధనూష్ రేంజ్‌కు తగ్గట్లుగానే.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేశారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 35 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ జరిగింది.

24వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా

24వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా

24వ రోజు ధనూష్ నటించిన ‘సార్' చిత్రానికి వసూళ్లు భారీగానే పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 19 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 51 లక్షలు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

24 రోజులకూ కలిపి ఎంతంటే?

24 రోజులకూ కలిపి ఎంతంటే?

‘సార్' చిత్రానికి 24 రోజుల్లో నైజాంలో రూ. 8.68 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.06 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 3.22 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.98 కోట్లు, వెస్ట్‌లో రూ. 89 లక్షలు, గుంటూరులో రూ. 1.59 కోట్లు, కృష్ణాలో రూ. 1.44 కోట్లు, నెల్లూరులో రూ. 78 లక్షలు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.40 కోట్లతో కలిపి తెలుగులో రూ. 23.04 కోట్లు షేర్, రూ. 43.78 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

తెలుగులో అన్ని కోట్ల లాభం

తెలుగులో అన్ని కోట్ల లాభం


తమిళ స్టార్ హీరో ధనూష్ నటించిన ‘సార్' మూవీకి తెలుగు వెర్షన్‌కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి రూ. 6.70 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. ఇక, ఈ సినిమా 24 రోజుల్లోనే రూ. 23.04 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 16.34 కోట్లు లాభాలతో రికార్డును కూడా సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

తెలుగులో ఓ రేంజ్‌లో రాబట్టిన ‘సార్' మూవీ.. 24 రోజుల్లో తమిళనాడులో రూ. 40.15 కోట్లు, కర్నాటకలో రూ. 7.98 కోట్లు, కేరళలో రూ. 1.16 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 24.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇలా మొత్తంగా 24 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 115.66 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 60.21 కోట్లు షేర్‌‌ను కూడా వసూలు చేసింది.

ఓవరాల్‌గా ఎంత లాభం అంటే

ఓవరాల్‌గా ఎంత లాభం అంటే


క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన ‘సార్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో ఓవరాల్‌గా దీనికి రూ. 36 కోట్లు ప్రీ రిలీజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నమోదైంది. అయితే, ఈ చిత్రానికి 24 రోజుల్లో రూ. 60.21 కోట్లు షేర్ వచ్చింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు రూ. 24.21 కోట్లు లాభాలతో రికార్డు నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X