SIR 6 Days Collections: తెలుగులో అరాచకం.. అన్ని కోట్ల లాభంతో రికార్డు.. తమిళంలో హిట్ అవ్వాలంటే!
పేరుకు కోలీవుడ్ హీరోనే అయినా ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు హాలీవుడ్‌కు కూడా పరిచయం అయిన స్టార్ ధనూష్. విలక్షణమైన నటనతో పాటు విభిన్నమై కాన్సెప్టులతో సినిమాలు చేస్తోన్న అతడు.. వరుస ప్రాజెక్టులతో సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నేరుగా తెలుగులో 'సార్' (తమిళంలో వాతి) అనే చిత్రంలో నటించాడు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కుతోంది. దీంతో కలెక్షన్లు ఓ రేంజ్‌లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధనూష్ నటించిన ఈ మూవీ ఆరు రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందో మీరే చూసేయండి!

సార్‌గా మారిపోయిన ధనూష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనూష్ నటించిన తాజా చిత్రమే 'సార్' (తమిళంలో వాతి). వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ సంగీతం ఇచ్చాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు నటించారు.

సార్ మూవీ బిజినెస్ వివరాలు
ధనూష్ రేంజ్‌తో పాటు 'సార్' మూవీపై ఆరంభం నుంచీ నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేశారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 35 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

6వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా
ధనూష్ నటించిన 'సార్' చిత్రానికి ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 6 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రూ. 72 లక్షలు షేర్, రూ. 1.35 కోట్లు గ్రాస్ వసూలైంది.

6 రోజులకూ కలిపి ఎంతంటే?
6 రోజుల్లో 'సార్' చిత్రానికి నైజాంలో రూ. 4.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.71 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 1.52 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.11 కోట్లు, వెస్ట్‌లో రూ. 45 లక్షలు, గుంటూరులో రూ. 93 లక్షలు, కృష్ణాలో రూ. 78 లక్షలు, నెల్లూరులో రూ. 44 లక్షలు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.06 కోట్లతో కలిపి రూ. 12.70 కోట్లు షేర్, రూ. 23.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

తెలుగులో లాభమా నష్టమా?
తమిళ హీరో ధనూష్ నటించిన 'సార్' మూవీకి తెలుగు వెర్షన్‌కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి రూ. 6.70 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. ఇక, ఈ సినిమా ఆరు రోజుల్లోనే రూ. 12.70 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.00 కోట్లు లాభాల మార్కు చేరి రికార్డును సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ధనూష్ 'సార్' మూవీ తమిళ వెర్షన్‌కు మాత్రం వసూళ్లు అంతగా రాలేదు. దీంతో 6 రోజుల్లో తమిళనాడులో రూ. 22.10 కోట్లు, కర్నాటకలో రూ. 4.80 కోట్లు, కేరళలో రూ. 70 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 85 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 14.05 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 6 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 64.21 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 33.50 కోట్లు వరకూ షేర్‌ను దక్కింది.

ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనూష్ నటించిన 'సార్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో ఓవరాల్‌గా దీనికి రూ. 36 కోట్లు ప్రీ రిలీజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నమోదైంది. అయితే, ఈ చిత్రానికి 6 రోజుల్లో రూ. 33.50 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఇది ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే మాత్రం రూ. 2.50 కోట్లు రాబట్టాలి.


Click it and Unblock the Notifications











