SIR 7 Days Collections: ధనుష్ కెరీర్ లో మరో బిగ్ హిట్.. 7 రోజుల్లో త్రివిక్రమ్ కు వచ్చిన వాటా ఎంతంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుందని చాలాసార్లు ఋజువు చేశాడు. ఇక అతను నటించిన చాలా సినిమాలకు కూడా తెలుగులో మంచి డిమాండ్ ఉంది. ఇక రీసెంట్ గా అయితే ధనుష్ సినిమాల బిజినెస్ పెరిగింది. ఇక సార్ సినిమాతో ధనుష్ కు టాలీవుడ్ లో మరింత డిమాండ్ పెరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. ఇక నిన్నటికి ఈ సినిమా విడుదలై 7 రోజులు పూర్తయ్యింది. ఇక మొత్తంగా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

 సార్‌గా మారిపోయిన ధనూష్

సార్‌గా మారిపోయిన ధనూష్

తమిళంలోనే కాకుండా స్టార్ హీరోగా ధనూష్ తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక ఈసారి పూర్తిగా తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి తెలుగు దర్శక నిర్మాతలతో 'సార్' (తమిళంలో వాతి) అనే సినిమా చేశాడు. మిడిల్ క్లాస్ ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ లో వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ లో నగవంశీ నిర్మించారు. ఇక సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. అలాగే త్రివిక్రమ్ ప్రొడక్షన్ ఫార్చూన్ ఫోర్ కూడా సహా నిర్మాతగా ఉన్నారు.

సార్ మూవీ బిజినెస్ ఎంతంటే..

సార్ మూవీ బిజినెస్ ఎంతంటే..


ధనూష్ రేంజ్ కు తగ్గట్టుగా ముందు నుంచే సినిమాకు మంచి బజ్ పెరగడంతో 'సార్' అటు తమిళ్ లోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా హక్కుల కోసం పోటీ కూడా ఎక్కువగా కనిపించింది. ఇక తెలుగులో ఈ సినిమా 5.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమిళ్ భాషతో కలువుకొని ప్రపంచ వ్యాప్తంగా వాతి/సార్ రూ. 35 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ చేసింది.

7వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్

7వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్

ధనూష్ నటించిన 'సార్' చిత్రానికి 7వ రోజు కూడా ఏపీ నైజాంలో మంచి స్పందనే వచ్చింది. నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 11 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రూ. 62 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ వసూలైంది.

7 రోజుల ఏపీ, నైజాం కలెక్షన్స్

7 రోజుల ఏపీ, నైజాం కలెక్షన్స్

7 రోజుల్లో 'సార్' సినిమా నైజాంలో రూ. 4.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 1.52 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.16 కోట్లు, వెస్ట్‌లో రూ. 47 లక్షలు, గుంటూరులో రూ. 97 లక్షలు, కృష్ణాలో రూ. 81 లక్షలు, నెల్లూరులో రూ. 81 లక్షలు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లతో కలిపి రూ. 13.36 కోట్లు షేర్, రూ. 22.90 కోట్లు గ్రాస్ వసూలు అందుకుంది.

తెలుగులో ప్రాఫిట్స్ ఎంతంటే..

తెలుగులో ప్రాఫిట్స్ ఎంతంటే..


'సార్' సినిమాకు తెలుగులో ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమాకు రూ. 6.70 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. ఇక, ఈ సినిమా 7 రోజుల్లోనే రూ. 13.36 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. దీంతో సార్ సినిమా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.66 కోట్ల రేంజ్ లో లాభాల అందుకొని హిట్ మూవీగా కొనసాగుతోంది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..


ధనూష్ 'సార్' సినిమా తమిళ భాషలో అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ అందుకోలేదు. ఇక 7 రోజుల్లో తమిళనాడులో రూ. 23.10 కోట్లు, కర్నాటకలో రూ. 4.15 కోట్లు, కేరళలో రూ. 75 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 90 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 14.05 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 6 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 15.10 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 35.10 కోట్లు వరకూ షేర్‌ దక్కింది.

త్రివిక్రమ్ కు ఎంత రావాలి..

త్రివిక్రమ్ కు ఎంత రావాలి..

త్రివిక్రమ్ సొంత ప్రొడక్షన్ ఫార్చూన్ ఫోర్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన 'సార్' సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్లు బిజినెస్ చేసింది. ఇక సినిమా రూ. 36 కోట్లు ప్రీ రిలీజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ సెట్ అయ్యింది. ఇక నగవంశీ, త్రివిక్రమ్ ప్రొడక్షన్ లు ప్రాఫిట్ ఎంత వచ్చినా కూడా సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాకు 7 రోజుల్లో రూ. 35.40 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. త్రివిక్రమ్ 17 కోట్లకు పైగా షేర్ వచ్చి ఉండవచ్చు. ఇక సినిమా లాభల్లోకి రావాలి అంటే మాత్రం రూ. మరో కోటి షేర్ రాబట్టాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X