SIR Total Collections: త్రివిక్రమ్ భార్య జాక్‌పాట్.. సార్ మూవీతో రికార్డు.. ఏకంగా అన్ని కోట్ల లాభమా!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమా స్థాయిలో భారీ స్థాయిలో పెరిగిపోయింది. అందుకే మన భాషలో స్ట్రయిట్ మూవీస్ చేసేందుకు చాలా మంది పక్క ఇండస్ట్రీలకు చెందిన హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలా ఇప్పటికే కొందరు సినిమాలు కూడా చేశారు. అందులో టాలెంటెడ్ హీరో ధనూష్ కూడా 'సార్' అనే సినిమాతో వచ్చాడు.
తమిళంలో 'వాతి' అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన వస్తోంది. దీంతో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధనూష్ సార్ మూవీ టోటల్ రిపోర్టును చూడండి!

సార్‌గా పలకరించిన ధనూష్: కోలీవుడ్ స్టార్ హీరో ధనూష్ నటించిన తాజా చిత్రమే 'సార్' (తమిళంలో వాతి). వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ సంగీతం ఇచ్చాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు నటించారు.
సార్ మూవీ బిజినెస్ వివరాలు: చదువు గొప్పదనం వివరించే కథతో వచ్చిన 'సార్' మూవీపై ఆరంభం నుంచీ నెలకొన్న అంచనాలతో పాటు ధనూష్ రేంజ్‌కు తగ్గట్లుగానే.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేశారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయింది.

మంచి టాక్.. కలెక్షన్లు ఫుల్‌గా: తమిళ స్టార్ హీరో ధనూష్ నటించిన సందేశాత్మక చిత్రమే 'సార్'. మంచి కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమాకు తమిళం, తెలుగులోనూ మంచి రెస్పాన్స్ దక్కింది. అందుకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. తద్వారా ఈ సినిమా లాభాల బాటలో నడిచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లిలా: 'సార్' చిత్రానికి ఫుల్ రన్‌లో నైజాంలో రూ. 9.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.18 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 3.38 కోట్లు, ఈస్ట్‌లో రూ. 2.06 కోట్లు, వెస్ట్‌లో రూ. 94 లక్షలు, గుంటూరులో రూ. 1.65 కోట్లు, కృష్ణాలో రూ. 1.52 కోట్లు, నెల్లూరులో రూ. 82 లక్షలు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.40 కోట్లతో కలిపి తెలుగులో రూ. 24.00 కోట్లు షేర్, రూ. 46.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

తెలుగులో అన్ని కోట్ల లాభం: తమిళ స్టార్ హీరో ధనూష్ నటించిన 'సార్' మూవీకి తెలుగు వెర్షన్‌కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి రూ. 6.70 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. ఇక, ఈ సినిమా మొత్తంగా రూ. 24.00 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 17.30 కోట్లు లాభాలతో రికార్డును కూడా సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: తెలుగులో ఓ రేంజ్‌లో రాబట్టిన 'సార్' మూవీ.. ఫుల్ రన్‌లో తమిళనాడులో రూ. 42.25 కోట్లు, కర్నాటకలో రూ. 8.05 కోట్లు, కేరళలో రూ. 1.18 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 24.80 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇలా మొత్తంగా రెండు వెర్షన్లను కలుపుకుని రూ. 120.83 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 63.05 కోట్లు షేర్‌ను కూడా వసూలు చేసింది.

ఓవరాల్‌గా ఎంత లాభం అంటే: మంచి కాన్సెప్టుతో రూపొందిన 'సార్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో ఓవరాల్‌గా దీనికి రూ. 36 కోట్లు ప్రీ రిలీజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నమోదైంది. అయితే, ఈ చిత్రానికి ఫుల్ రన్‌లో రూ. 63.05 కోట్లు షేర్ వచ్చింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు రూ. 27.05 కోట్లు లాభాలతో రికార్డు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











