Sir Day 1 Collection: ధనుష్ సినిమాకు భారీ కలెక్షన్స్.. ఆ హీరోల వసూళ్లనూ చేరుకోలేని 'సార్'!
హిట్స్ ఫ్లాప్స్ అంటూ ఫలితాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఇటీవల తిరు, నేనే వస్తున్నా వంటి సినిమాలు ధనుష్ కు ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. దీంతో బైలింగువల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే ధనుష్ తమిళ హీరో అయనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
అందుకే ఆయన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అవుతుంటాయి. కానీ ఈసారి నేరుగా తెలుగు సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ద్విభాష చిత్రంగా వచ్చి సార్ (తమిళంలో వాతి)కు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!

బ్యూటిఫుల్ హీరోయిన్..
తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాల డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ధనుష్ చిత్రం సార్ (తమిళంలో వాతి). సీతార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేరోజు అంటే ఫిబ్రవరి 17న చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాలో బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న హైపర్ ఆది ఓ పాత్ర చేశాడు.

థియేటర్స్ కౌంట్..
రఘువరన్ బీటెక్ సినిమాతో ధనుష్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ పెరిగింది. అప్పటి నుంచి ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ విడుదల చేస్తున్నారు. ఇక ఈసారి నేరుగా సార్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక నైజాంలో 150, సీడెడ్ లో 55, ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా 200 థియేటర్లలో విడదలైంది. సార్ సినిమాను మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి 415 పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

ప్రీ రిలీజ్ బిజినెస్..
కోలీవడ్ స్టార్ హీరో ధనుష్ కు ఉన్న మార్కెట్ ను బట్టి సార్ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నిజాం ఏరియాలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ అయింది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అవ్వగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ధనుష్ సినిమా టార్గెట్ రూ. 35 కోట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది.

తొలి రోజు తెలుగులో..
ధనుష్ సార్ సినిమాకు సంగీతం అందించిన జీవీ ప్రకాష్ తన మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. ధనుష్ ద్విభాష చిత్రం సార్ కు మొదటి రోజు మంచి ఓపెనింగ్సే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 1.03 కోట్లు, సీడెడ్ లో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 34 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 26 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 10 లక్షలు, గుంటూరు 25 లక్షలు, కృష్ణా రూ. 23 లక్షలు, నెల్లూరు రూ. 14 లక్షలు కలెక్షన్స్ కొల్లకొట్టగా.. మొత్తంగా రూ. 2.65 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా.. రూ. 4.52 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూళు అయ్యాయి.

మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా..
విద్య, స్కూల్లు వంటి మెసేజ్ ఒరియెంటెడ్ చిత్రంగా వచ్చిన ధనుష్ సార్ సినిమాకు తొలి రోజు భారీ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.65 కలెక్ట్ కాగా తమిళనాడులో రూ. 8 కోట్లు, కర్ణాటకలో రూ. 1.5 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 1.5 కోట్లు వసూళ్లు సాధించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ధనుష్ సార్ సినిమా మొదటి రోజు రూ. 14 కోట్లు కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

క్లీన్ హిట్ కు..
ధనుష్ లేటెస్ట్ సినిమా సార్ కు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో రూ. 6 కోట్లుగా బ్రేక్ ఈవెన్ గా నమోదు అయింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 2.65 కలెక్షన్స్ రాగా.. ఇంకా రూ. 3.35 కోట్లు వస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ధనుష్ సినిమాకు వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికీ కోలీవుడ్ లోని స్టార్ హీరోలు విజయ్ వారిసు (రూ. 46.32 కోట్లు), అజిత్ తునివు (రూ. 50 కోట్లు) మొదటి రోజు కలెక్షన్స్ ను మాత్రం రీచ్ కాలేకపోయింది.


Click it and Unblock the Notifications











