Sir Day 2 Collection: తెలుగులో సార్ దూకుడు.. ఇంకొన్ని లక్షలు వస్తే రికార్డ్.. ఆ క్లబ్ లో ధనుష్ సినిమా!
సౌత్ లోనే కాకుండా నార్త్, హాలీవుడ్ సినిమాల్లోనూ ఆకట్టుకున్న స్టార్ హీరో ధనుష్. రాంఝనా, ఆత్రంగి రే వంటి హిందీ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ది ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ అనే సినిమాతో హాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ధనుష్ గతేడాది గ్రే మ్యాన్ సినిమాలో నెగెటివ్ రోల్ చేసి తనదైన స్టైల్ లో అలరించాడు.
అలాగే తెలుగు, తమిళ భాషల్లో తిరు, నేనే వస్తున్నా సినిమాలు విడుదలైన ఆశించినంతగా హిట్ కాలేదు. ఈసారి రెండు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించిన సినిమా సార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ధనుష్ లేటేస్ట్ బైలింగువల్ మూవీ సార్ ఫిబ్రవరి 17న విడుదల కాగా.. రెండో రోజు వసూళ్లపై లుక్ వేద్దామా!

స్కూల్ చదువు కాన్సెప్టుతో..
ధనుష్ లేటెస్ట్ బైలింగువల్ మూవీ సార్ తమిళంలో వాతిని సితార ఎంటర్టైన్ మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించగా.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. స్నేహగీతం సినిమాలో హీరోగా అలరించిన వెంకీ అట్లూరి.. వరుణ్ తేజ్, రాశీ ఖన్నా నటించిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మారారు. స్కూల్ చదువు కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సార్ సినిమాను తెలుగు, తమిళంలో ఫిబ్రవరి 17న మహా శివరాత్రి కానుకగా విడుదల చేశారు.

ప్రీ రిలీజ్ బిజినెస్..
టాలెంటెడ్ హీరో ధనుష్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా సార్ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నిజాం ఏరియాలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ అయింది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అవ్వగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది.
అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా ఉంది.

తొలి రోజు తెలుగులో..
ధనుష్ ద్విభాష చిత్రం సార్ కు మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాగా రెండో రోజు అంతకుమించి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 1.30 కోట్లు, సీడెడ్ లో రూ. 47 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 40 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 30 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 12 లక్షలు, గుంటూరు 24 లక్షలు, కృష్ణా రూ. 22 లక్షలు, నెల్లూరు రూ. 10 లక్షలు కలెక్షన్స్ కొల్లకొట్టింది. దీంతో మొత్తంగా రూ. 3.15 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా.. రూ. 6.02 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూళు అయ్యాయి.

రెండు రోజుల్లో వచ్చింది..
బింబిసార బ్యూటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ధనుష్ ద్విభాషా చిత్రం సార్ కు తెలుగులో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో నైజాంలో రూ. 2.34 కోట్లు, సీడెడ్ లో రూ. 77 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 74 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 57 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 22 లక్షలు, గుంటూరు 49 లక్షలు, కృష్ణా రూ. 42 లక్షలు, నెల్లూరు రూ. 25 లక్షల కలెక్షన్స్ నమోదు చేసింది. అంటే మొత్తంగా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.80 కోట్ల షేర్, రూ. 10.54 కోట్ల గ్రాస్ అందుకుంది.

వరల్డ్ వైడ్ గా..
విద్య, స్కూల్లు వంటి మెసేజ్ ఒరియెంటెడ్ చిత్రంగా వచ్చిన ధనుష్ సార్ సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2 రెండు రోజుల్లో రూ. 5.80 కోట్లు రాగా.. యూకేలో రూ. 52 లక్షలు, కర్ణాటకలో రూ. 1.62 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు రాబట్టి ఇలా ప్రపంచవ్యాప్తంగా ధనుష్ సినిమా రెండు రోజుల్లు రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు..
ధనుష్ లేటెస్ట్ సినిమా సార్ కు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా రూ. 6 కోట్లుగా బ్రేక్ ఈవెన్ నమోదు అయింది. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో రూ. 5.80 కోట్లు రాగా ఇంకా రూ. 20 లక్షలు వస్తే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుంది. దీంతో 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసినట్లు అవుతుంది. అలాగే రెండు రోజుల్లో రూ. 20 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా సార్ నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











