Sir Day 4 Collection: మండే టెస్ట్ పాస్ అయిన సార్.. తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా.. ఎంతంటే?

సినిమాల హిట్స్ ఫ్లాప్స్ అంటూ ఫలితాలతో ఎలాంటి సంబంధం లేకుండా దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఇటీవల తిరు, నేనే వస్తున్నా వంటి సినిమాలు ధనుష్ కు ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. దీంతో బైలింగువల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే ధనుష్ తమిళ హీరో అయనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అవుతుంటాయి. కానీ ఈసారి నేరుగా తెలుగు సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న విడుదలైన ధనుష్ సార్ సినిమా నాలుగో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!

తెలుగు, తమిళంలో ఒకేరోజు..

తెలుగు, తమిళంలో ఒకేరోజు..

తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాల డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన లేటెస్ట్ ధనుష్ మూవీ సార్. తమిళంలో వాతిగా రూపొందించారు. సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేరోజు అంటే ఫిబ్రవరి 17న చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఇక ఈ సినిమాలో బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న హైపర్ ఆది ఓ పాత్ర చేశాడు.

థియేటర్స్ కౌంట్..

థియేటర్స్ కౌంట్..

రఘువరన్ బీటెక్ సినిమాతో ధనుష్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ పెరిగింది. అప్పటి నుంచి ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ విడుదల చేస్తున్నారు. ఇక ఈసారి నేరుగా సార్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా నైజాంలో 150, సీడెడ్ లో 55, ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా 200 థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి 415కు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన ధనుష్ కు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. దానికి తగినట్లుగానే తెలుగు రాష్ట్రాల్లోని నిజాం ఏరియాలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ అయింది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అవ్వగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది. అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా ఉంది.

 థియేటర్ ఆక్యుపెన్సీ వివరాలు..

థియేటర్ ఆక్యుపెన్సీ వివరాలు..

ధనుష్ సార్ సినిమాకు నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సంగీతం అందించారు. ఆయన అందించిన సంగీతం సార్ కు హైలెట్ గా నిలిచిందని రివ్యూలు చెబుతున్నాయి. ధనుష్ ద్విభాష చిత్రమైన సార్ సినిమాకు నాలుగో రోజు తెలుగులో ఉదయం 28.31 శాతం, మధ్యాహ్నానికి కాస్తా పెరిగి 29.96 శాతం, సాయంత్రానికి ఇంకాస్త పెరిగి 33.89 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అలాగే తమిళంలో ఉదయం 25.76 శాతం, మధ్యాహ్నం 25.35 శాతం, సాయంత్రానికి చాలా తగ్గి 22.15 శాతంగా నమోదు అయింది. అంటే తమిళంలో కంటే తెలుగులోనే ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

 4వ రోజు కలెక్షన్స్..

4వ రోజు కలెక్షన్స్..

విద్య, స్కూల్లు వంటి మెసేజ్ ఒరియెంటెడ్ చిత్రంగా వచ్చిన ధనుష్ లేటెస్ట్ బైలింగువల్ చిత్రం సార్/వాతి సినిమాకు తొలి రోజు భారీ కలెక్షన్స్ వచ్చాయి. అదే కొనసాగుతూ మూడు రోజుల్లో మంచి లాభాలు తెచ్చుకున్నాడు ఈ సార్. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి నాలుగో రోజు రూ. 5.50 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ రానున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే వర్కింగ్ డే అయిన సోమవారం కూడా సార్ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

 నాలుగు రోజుల్లో వచ్చింది..

నాలుగు రోజుల్లో వచ్చింది..

సాప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలను తెరకెక్కించే వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమానే సార్. ఈ మధ్య చాలామంది దర్శకులు బైలింగువల్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అలాంటివారిలో ఒకరిగా వెంకీ నిలిచారు. ఈ సినిమాకు నాలుగు రోజుల్లో రూ. 38.85 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అంటే ఇప్పటికే రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ కాగా అది మరింతగా పెరగనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X