Sir Day 4 Collection: క్లిక్ అవుతున్న 'సార్' పాఠాలు.. తెలుగులో అంత లాభం.. అలా హిట్ కు మాత్రం!

సౌత్, నార్త్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న దక్షిణాది హీరో ధనుష్. రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ధనుష్.. ఆ తర్వాత అనేక చిత్రాలతో అలరించాడు. ఆయన ప్రతి సినిమా తెలుగలోనూ డబ్ అవుతుంది.

ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేకమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా ధనుష్ హీరోగా తమిళం, తెలుగు బైలింగువల్ చిత్రంగా వచ్చిన మూవీ సార్/వాతి. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ధనుష్ వాతి/సార్ సినిమాకు 4వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

హీరోగా అలరించిన తర్వాత..

హీరోగా అలరించిన తర్వాత..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా ద్విబాషా చిత్రం సార్/వాతిని సితార ఎంటర్టైన్ మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించగా.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. స్నేహగీతం సినిమాలో హీరోగా అలరించిన వెంకీ అట్లూరి.. వరుణ్ తేజ్, రాశీ ఖన్నా నటించిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమా తర్వాత వెంకీ దర్శకత్వం వహించిన సినిమానే సార్. స్కూల్ చదువు కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్ డిటెల్స్..

ప్రీ రిలీజ్ బిజినెస్ డిటెల్స్..

నటనతో ఆకట్టుకునే హీరో ధనుష్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా సార్ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నిజాం ఏరియాలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ అయింది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అవ్వగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది.

అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా ఉంది.

 4వ రోజు తెలుగులో

4వ రోజు తెలుగులో

ధనుష్ తెలుగులో నేరుగా చేసిన సార్ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అదే కంటిన్యూ అవుతూ.. నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 46 లక్షలు, సీడెడ్ లో రూ. 20 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 5 లక్షలు, గుంటూరు 8 లక్షలు, కృష్ణా రూ. 7 లక్షలు, నెల్లూరు రూ. 4 లక్షలు కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో మొత్తంగా రూ. 1.15 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా.. రూ. 2.22 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూళు అయ్యాయి.

4 రోజుల్లో వచ్చింది..

4 రోజుల్లో వచ్చింది..

భీమ్లా నాయక్ బ్యూటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ధనుష్ తాజా చిత్రం సార్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో నైజాంలో రూ. 4.01 కోట్లు, సీడెడ్ లో రూ. 1.43 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.31 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 97 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 38 లక్షలు, గుంటూరు 82 లక్షలు, కృష్ణా రూ. 469 లక్షలు, నెల్లూరు రూ. 39 లక్షల కలెక్షన్స్ నమోదు చేసింది.

అంటే మొత్తంగా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల షేర్, రూ. 18.61 కోట్ల గ్రాస్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ లో కలిపి రూ. 95 లక్షలు వసూళు చేసింది. అంటే మొత్తంగా తెలుగు వెర్షన్ కు రూ. 10.95 కోట్లు షేర్, రూ. 20.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..

విద్య, స్కూల్లు వంటి మెసేజ్ ఒరియెంటెడ్ కాన్సెప్ట్ తో వచ్చిన తమిళ స్టార్ హీరో ధనుష్ బైలింగువల్ మూవీ సార్/వాతికి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో రూ. 18.61 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. తమిళనాడులో రూ. 19.50 కోట్లు, కర్ణాటకలో రూ. 4.15 కోట్లు, కేరళలో రూ. 60 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 75 లక్షలు, ఓవర్సీస్ లో రూ. 12.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో సార్/వాతి సినిమాకు వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో రూ. 55.66 కోట్లు గ్రాస్, రూ. 28.90 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు..

బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు..

తెలుగు రాష్ట్రాల్లో ధనుష్ సినిమా సార్ కు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 5.50 కోట్లు కాగా రూ. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుని రూ. 4 కోట్ల ఫ్రాఫిట్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ కలుపుకుని రూ. 6.20 ప్రీ రిలీజ్ బిజినెస్ కు బ్రేక్ ఈవెన్ రూ. 6.70 కోట్లు నమోదు అయింది. ఇలా చూసుకుంటే తెలుగు వెర్షన్ కు రూ. 4.25 కోట్లు లాభంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 36 కోట్లు బ్రేక్ ఈవెన్ పూర్తి చేయాలంటే ఇంకా రూ. 7.10 కోట్లు రాబట్టాలి. ఇలా అయితేనే ప్రపంచవ్యాప్తంగా హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X