Sir Day 7 Collection: తెలుగులో అదిరిపోతున్న సార్ పాఠాలు.. అన్ని కోట్ల వైపుగా ధనుష్ మూవీ!

పేరుకు కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ ధనుష్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. గతేడాది ది గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ చిత్రంలో అవిక్ సాన్ గా యాక్టింగ్ పరంగా అదరగొట్టిన ధనుష్ తిరు, నేనే వస్తున్నా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయాడు. తాజాగా తెలుగు, తమిళం రెండు భాషల్లో ఏక కాలంలో నిర్మించిన సార్/వాతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ధనుష్. ఫిబ్రవరి 17న విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమా వారం రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా!

ఇటీవల సక్సెస్ మీట్..

ఇటీవల సక్సెస్ మీట్..

ఇప్పటివరకు ప్రేమ కథా చిత్రాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి తాజాగా తెరకెక్కించిన చిత్రం సార్. తమిళంలో వాతి. ధనుష్ హీరోగా, బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా కొత్త జోడీగా వచ్చిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న తెలుగు తమిళంలో ఒకేరోజు చాలా గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. ఇటీవలే ఈ మూవీ సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు.

థియేటర్స్ కౌంట్ ఇలా..

థియేటర్స్ కౌంట్ ఇలా..

విలక్షణమైన నటనతో అదరగొట్టే ధనుష్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ పెరిగింది. అందుకే ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ విడుదల చేస్తున్నారు. ఇక ఈసారి నేరుగా సార్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా నైజాంలో 150, సీడెడ్ లో 55, ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా 200 థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి 415కు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

కోలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన ధనుష్ కు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. దానికి తగినట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో నిజాం ఏరియాలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ కాగా.. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అయింది.

దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది. అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా ఉంది.

థియేటర్ ఆక్యుపెన్సీ వివరాలు..

థియేటర్ ఆక్యుపెన్సీ వివరాలు..

ధనుష్ సార్ సినిమాకు నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సంగీతం అందించారు. ఆయన అందించిన సంగీతం సార్ కు హైలెట్ గా నిలిచిందని సినీ విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధనుష్ ద్విభాష చిత్రమైన సార్ సినిమాకు 7వ రోజు తెలుగులో ఉదయం 28.20 శాతం, మధ్యాహ్నానికి కాస్తా తగ్గి 25.95 శాతం, సాయంత్రానికి పెరిగి 29.67 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.

అలాగే తమిళంలో ఉదయం 24.22 శాతం, మధ్యాహ్నం 22.80 శాతం, సాయంత్రానికి 22.30 శాతంగా నమోదు అయింది. దీన్ని బట్టి చూస్తే తమిళంలో కంటే తెలుగులోనే ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

7వ రోజు వసూళ్లు..

7వ రోజు వసూళ్లు..

చదువు ప్రధాన అంశంగా తెరకెక్కిన వెంకీ అట్లూరి డైరెక్టెడ్ సినిమా సార్. ధనుష్ తొలి సారిగా బైలింగువల్ చిత్రాంగా నటించిన ఈ మూవీకి ప్రజలు మంచి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఫలితంగా వసూళ్లు బాగా కలెక్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ధనుష్ సార్/వాతి సినిమాకు 7వ రోజు రూ. 2.50 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

వారం రోజుల్లో ఎంతంటే..

వారం రోజుల్లో ఎంతంటే..

వైవిధ్యమైన చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ టీచర్ గా అలరించిన తాజా సినిమానే సార్. ఇదే చిత్రాన్ని తమిళంలో వాతిగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ మూవీ తమిళంలో కంటే తెలుగులో మంచి ప్రజాదరణ పొందుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సార్/వాతి సినిమాకు వారం రోజుల్లో రూ. 45.95 కోట్ల నెట్ కలెక్షన్స్ రానున్నట్లు ట్రేడ్ వర్గాలు ఊహిస్తున్నాయి. అంటే మరికొన్ని రోజుల్లో రూ. 50 కోట్ల క్లబ్ లోకి చేరనున్నట్లు తెలుస్తోంది. .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X