Sir 10 Days Collection: సండే రోజున 'సార్' క్రేజ్.. ఒక్కరోజే అన్ని కోట్లు.. ఆ క్లబ్ లోకి చేరి రికార్డ్!
సౌత్, నార్త్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న దక్షిణాది హీరో ధనుష్. రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ధనుష్.. ఆ తర్వాత అనేక సినిమాలతో అలరించాడు. ఆయన ప్రతి సినిమా తెలుగలోనూ డబ్ అవుతుంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేకమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
తాజాగా ధనుష్ హీరోగా తమిళం, తెలుగు బైలింగువల్ చిత్రంగా వచ్చిన మూవీ సార్/వాతి. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ధనుష్ వాతి/సార్ సినిమాకు 10వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

సంయుక్తంగా నిర్మాణం..
ఇప్పటివరకు ప్రేమ కథా చిత్రాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి తాజాగా తెరకెక్కించిన చిత్రం సార్. తమిళంలో వాతి. ధనుష్ హీరోగా, బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా కొత్త జోడీగా వచ్చిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న తెలుగు తమిళంలో ఒకేరోజు చాలా గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..
కోలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన ధనుష్ కు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. దానికి తగినట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియాలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ కాగా.. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది.
అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా ఉంది.

10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో..
ధనుష్ తెలుగులో నేరుగా చేసిన సార్ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అదే కంటిన్యూ అవుతూ.. 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 51 లక్షలు, సీడెడ్ లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 20 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 12 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 7 లక్షలు, గుంటూరు 10 లక్షలు, కృష్ణా రూ. 10 లక్షలు, నెల్లూరు రూ. 5 లక్షలు కలెక్షన్స్ వసూలు చేసింది.
దీంతో మొత్తంగా రూ. 1.31 కోట్లు షేర్ కలెక్షన్స్ రాగా.. రూ. 2.45 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అంటే సెలవు దినమైన సండే ఒక్క రోజే రూ. 1.31 కోట్లు రాబట్టింది.

10 రోజుల్లో వచ్చింది..
భీమ్లా నాయక్ బ్యూటి సంయుక్త మీనన్, ధనుష్ తొలిసారిగా జత కట్టిన సార్ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో నైజాంలో రూ. 6.17 కోట్లు, సీడెడ్ లో రూ. 2.18 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 2.13 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 1.39 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 59 లక్షలు, గుంటూరు రూ. 1.16 కోట్లు, కృష్ణా రూ. 98 లక్షలు, నెల్లూరు రూ. 56 లక్షల కలెక్షన్స్ సాధించింది.
అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15.16 కోట్ల షేర్, రూ. 28.41 కోట్ల గ్రాస్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ లో కలిపి రూ. 1.22 కోట్లు వసూళు చేసింది. అంటే మొత్తంగా వరల్డ్ వైడ్ గా తెలుగు వెర్షన్ కు రూ. 16.38 కోట్లు షేర్, రూ. 31 కోట్లు గ్రాస్ వసూలైంది.

వరల్డ్ వైడ్ గా..
విద్య, స్కూల్లు వంటి మెసేజ్ ఒరియెంటెడ్ కాన్సెప్ట్ తో వచ్చిన తమిళ స్టార్ హీరో ధనుష్ బైలింగువల్ మూవీ సార్/వాతికి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో రూ. 28.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. తమిళనాడులో రూ. 29.45 కోట్లు, కర్ణాటకలో రూ. 6.80 కోట్లు, కేరళలో రూ. 95 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి, ఓవర్సీస్ లో రూ. 19.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది.
దీంతో సార్/వాతి సినిమాకు వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో రూ. 86.01 కోట్లు గ్రాస్ కు పైగా, రూ. 44.65 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే రూ. 80 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా షేర్ కలెక్షన్స్ పరంగా రూ. 50 కోట్ల క్లబ్ వైపు పయనిస్తోంది.

వరల్డ్ వైడ్ గా లాభాలు..
ఆంధ్రా, తెలంగాణలో ధనుష్ సినిమా సార్ కు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 5.50 కోట్లు కాగా రూ. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుని రూ. 9.16 కోట్ల లాభం అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ కలుపుకుని రూ. 6.20 ప్రీ రిలీజ్ బిజినెస్ కు బ్రేక్ ఈవెన్ రూ. 6.70 కోట్లు నమోదు అయింది.
ఇలా చూసుకుంటే తెలుగు వెర్షన్ కు రూ. 9.68 కోట్లు ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసి రూ. 8.65 కోట్లు లాభం అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











