Sir 16 Days Collection: మూడో వీకెండ్ కూడా సార్ సత్తా.. 100 కోట్ల క్లబ్ లోకి ధనుష్ మూవీ!

ఎంతో కాలంగా సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు పొందాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా నిత్యం ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకుంటూ సత్తా చాటుతున్నాడు. విలక్షణ నటనతో అబ్బురపరిచే ధనుష్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ బైలింగువల్ సినిమా సార్/వాతి ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.

ద్విభాష చిత్రంగా వచ్చిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న విడుదలైంది. మొదటి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా 16వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే.

శివరాత్రి సందర్భంగా..

శివరాత్రి సందర్భంగా..

ఇప్పటివరకు ప్రేమ కథా చిత్రాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి తాజాగా తెరకెక్కించిన మెసేజ్ ఒరియెంటెడ్ చిత్రం సార్. తమిళంలో వాతి. ధనుష్ హీరోగా, బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా కొత్త జోడీగా వచ్చిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న తెలుగు తమిళంలో ఒకేరోజు చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు.

థియేటర్స్ కౌంట్..

థియేటర్స్ కౌంట్..

ఎమోషన్స్, డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేసే ధనుష్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ పెరిగింది. అందుకే ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ విడుదల చేస్తున్నారు. ఇక ఈసారి నేరుగా సార్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా నైజాంలో 150, సీడెడ్ లో 55, ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా 200 థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి 415కు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకరైన ధనుష్ కు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. దానికి తగినట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియాలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ చేయగా.. మొత్తంగా రూ. 5.50 కోట్ల బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది. అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా ఉంది.

థియేటర్ ఆక్యుపెన్సీ..

థియేటర్ ఆక్యుపెన్సీ..

ధనుష్ సార్ సినిమాకు నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సంగీతం అందించారు. ధనుష్ ద్విభాషా చిత్రమైన సార్ సినిమాకు 16వ రోజు తెలుగులో ఉదయం 29.08 శాతం, మధ్యాహ్నానికి కాస్తా తగ్గి 25.69 శాతం, సాయంత్రానికి ఇంకా పెరిగి ఉదయం లాగే 29.90 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అలాగే తమిళంలో ఉదయం 16.55 శాతం, మధ్యాహ్నం 21.36 శాతం, సాయంత్రానికి 16.86 శాతంగా నమోదు అయింది. అంటే వీకెండ్ అయిన శనివారం రోజున తెలుగులో మంచి టాక్ తో దూసుకుపోతున్న బలగం సినిమా కంటే కాస్తా మెరుగ్గానే ఆక్యుపెన్సీ దక్కినట్లు తెలుస్తోంది.

16వ రోజు వసూళ్లు..

16వ రోజు వసూళ్లు..

పిల్లలకు విద్యా ఖచ్చితం అనే ప్రధాన అంశంగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రాల డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సినిమా సార్. ధనుష్ తొలి సారిగా బైలింగువల్ చిత్రంగా నటించిన ఈ మూవీకి ప్రజలు మంచి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఫలితంగా వసూళ్లు బాగా కలెక్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ధనుష్ సార్/వాతి సినిమాకు 16వ రోజు అంటే శనివారం రోజున రూ. 1.15 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. వేరే చిన్న సినిమాలు పోటీ పడుతున్న కూడా సార్ కు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.

రూ. 100 కోట్ల క్లబ్ దిశగా..

రూ. 100 కోట్ల క్లబ్ దిశగా..

వైవిధ్యమైన చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ టీచర్ గా అలరించిన తాజా సినిమానే సార్. ఇదే చిత్రాన్ని తమిళంలో వాతిగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులో బాగా ప్రజాదరణ పొందుతూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 97.14 కోట్ల గ్రాస్, రూ. 50.50 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో సార్/వాతి సినిమాకు 16 రోజుల్లో రూ. 65.30 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే మరికొన్ని రోజుల్లో సార్ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లోకి (గ్రాస్) చేరనుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X