Sir 17 Days Collection: పరుగులు పెడుతున్న 'సార్' పాఠాలు.. తివిక్రమ్ కి లాభాలు ఎంతంటే?
కేవలం దక్షిణాదిలోనే కాకుండా హిందీ, హాలీవుడ్ చిత్రాల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంటున్న తమిళ స్టార్ హీరో ధనుష్. హిందీలో రాంఝానా, ఆత్రంగి రే వంటి మంచి హిట్స్ అందుకున్న ధనుష్ గతేడాది ది గ్రే మ్యాన్ సినిమాలో నెగెటివ్ రోల్ తో ఇంప్రెస్ చేశాడు. కాంట్రాక్ట్ కిల్లర్ అవిక్ సాన్ గా మంచి నటనతో అట్రాక్ట్ చేశాడు. అలాగే లవ్ స్టోరీగా తిరు, సస్పెన్స్ థ్రిల్లర్ గా నేనే వస్తున్నా చిత్రాలతో ముందుకు వచ్చిన ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. తాజాగా బైలింగువల్ చిత్రంగా సార్/వాతి సినిమాతో ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు 17 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేద్దామా!

హీరోయిన్ గా సంయుక్త..
తమిళ స్టార్ హీరో ధనుష్ తన విలక్షణ నటనతో అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన నటనాకౌశల్యానికి తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ అయ్యారు. ధనుష్ తాజా ద్విబాషా చిత్రం సార్/వాతిని డైరెక్టర్ త్రివిక్రమ్ బ్యానర్ అయిన సితార ఎంటర్టైన్ మెంట్ తోపాటు ఫార్చ్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు హీరోగా ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్ గా మారిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేసింది.

థియేటర్స్ కౌంట్ ఇలా..
సినిమాలు హిట్ అయిన ఫెయిల్ అయినా అదేం పట్టించుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తుంటాడు స్టార్ హీరో ధనుష్. అందుకే ఆయన చిత్రాలు వెనువెంటనే వస్తాయి. ఈ కొత్త ఏడాది ధనుష్ నుంచి వచ్చిన సినిమా సార్. ఈ చిత్రానికి నైజాంలో 150, సీడెడ్ లో 55, ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా 200 థియేటర్లలో విడుదలైంది. ధనుష్ సార్ సినిమాను మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి 415కు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..
కోలీవుడ్ హీరో ధనుష్ కు ఉన్న మార్కెట్ కు అనుగుణంగానే సార్/వాతి సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ అయింది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అవ్వగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది. అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా ఉంది.

థియేటర్ ఆక్యుపెన్సీ డీటెల్స్..
తెలుగు, తమిళంలో తెరకెక్కిన సార్/వాతి సినిమాలో ధనుష్ కు జోడిగా బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ జత కట్టింది. సినిమా విడుదలకు ముందు వచ్చిన మాస్టారు మాస్టారు అనే సాంగ్ ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఇక ఈ చిత్రానికి 17వ రోజు తెలుగులో ఉదయం 28.96 శాతం, మధ్యాహ్నానికి కాస్తా పెరిగి 38.30 శాతం, సాయంత్రానికి ఇంకా పెరిగి 35.04 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అలాగే తమిళంలో ఉదయం 19.17 శాతం, మధ్యాహ్నం 30.50 శాతం, సాయంత్రానికి 25.70 శాతంగా నమోదు అయింది. అంటే ఎప్పటిలానే తమిళంలో కంటే తెలుగులోనే ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండగా.. ఈ సండే మాత్రం తమిళంలో కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదు అయింది.

17వ రోజు కలెక్షన్స్ ఎంతంటే..
హీరో, నెగెటివ్ పాత్రలతో అదరగొట్టే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా స్కూల్ టీచర్ గా ఆకట్టుకున్న సినిమా సార్/వాతి. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తనదైన కామెడీతో ఆక్టట్టుకున్న ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే హిట్ టాక్ వస్తోంది. ఫలితంగా ధనుష్ సార్/వాతి సినిమాకు 17వ రోజు రూ. 1.75 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ రానున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అంటే వీకెండ్ అయిన సండే రోజు సార్ కు ఇప్పటికీ కలెక్షన్స్ బాగానే వచ్చినట్లు తెలుస్తోంది.

17 రోజుల కలెక్షన్స్..
ఇటీవల హీరోలు, డైరెక్టర్స్ బైలింగువల్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. అయితే వాటిలో కొన్ని హిట్ కాగా మరికొన్ని ఫట్టుమంటున్నాయి. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి-ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన ద్విభాషా చిత్రం సార్/వాతికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు 17 రోజుల్లో రూ. 67.40 కోట్ల నెట్ కలెక్షన్స్ రానున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటికే ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించగా.. ఈరోజుతో ఇంకాస్తా పెరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు రూ. 16 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











