Sir 18 Days Collection: వర్కింగ్ డేలోనూ సార్ సత్తా.. అక్కడ మాత్రం దారుణంగా.. ఎంతొచ్చిందంటే?
ఎంతో కాలంగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ తనదైన గుర్తింపు పొందాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా నిత్యం ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకుంటూ సత్తా చాటుతున్నాడు. విలక్షణ నటనతో అబ్బురపరిచే ధనుష్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ బైలింగువల్ సినిమా సార్/వాతి ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ద్విభాష చిత్రంగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో సార్ సినిమా ఇప్పటికే రూ. 103.86 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. 18వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం!

తొలి ప్రేమ సినిమాతో..
తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన ద్విబాషా చిత్రం సార్/వాతిని సితార ఎంటర్టైన్ మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించగా.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. స్నేహగీతం సినిమాలో హీరోగా అలరించిన వెంకీ అట్లూరి.. వరుణ్ తేజ్, రాశీ ఖన్నా నటించిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాల తర్వాత వెంకీ దర్శకత్వం వహించిన సినిమానే సార్. స్కూల్ చదువు కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఎన్ని థియేటర్స్ లో..
ఆద్యంతం తన విలక్షణ నటనతో అదరగొట్టే ధనుష్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ పెరిగింది. అందుకే ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ విడుదల చేస్తున్నారు. ఇక ఈసారి నేరుగా సార్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా నైజాంలో 150, సీడెడ్ లో 55, ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా 200 థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి 415కు పైగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
కోలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన ధనుష్ కు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. దానికి తగినట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియాలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ చేయగా.. మొత్తంగా రూ. 5.50 కోట్ల బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది. అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా నమోదు అయింది.

థియేటర్ ఆక్యుపెన్సీ..
ధనుష్ సార్ సినిమాకు నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సంగీతం అందించారు. ఆయన అందించిన సంగీతం సార్ కు హైలెట్ గా నిలిచిందని సినీ విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధనుష్ ద్విభాషా చిత్రమైన సార్ సినిమాకు 18వ రోజు తెలుగులో ఉదయం 28.55 శాతం, మధ్యాహ్నానికి తగ్గి 20.48 శాతం, సాయంత్రానికి కొంచెం పెరిగి 25.17 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అలాగే తమిళంలో ఉదయం 7.24 శాతం, మధ్యాహ్నం 10.28 శాతం, సాయంత్రానికి 5.82 అతి తక్కువ శాతంగా నమోదు అయింది. సోమవారం రోజున తమిళంలో దారుణంగా ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు తెలుస్తోంది.

18వ రోజు వసూళ్లు..
పిల్లలకు విద్యా కచ్చితం అనే ప్రధాన అంశంగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రాల డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సినిమా సార్. ధనుష్ తొలి సారిగా బైలింగువల్ చిత్రంగా నటించిన ఈ మూవీకి ప్రజలు మంచి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఫలితంగా వసూళ్లు బాగా కలెక్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ధనుష్ సార్/వాతి సినిమాకు 18వ రోజు అంటే సోమవారం రోజున రూ. 1 కోటి ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అంటే వర్కింగ్ డే అయిన మండే కూడా మంచి వసూళ్లే సాధించింది. ే

18 రోజుల్లో ఎంతంటే..
వైవిధ్యమైన చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ టీచర్ గా అలరించిన తాజా సినిమానే సార్. ఇదే చిత్రాన్ని తమిళంలో వాతిగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ మూవీ తమిళంలో కంటే తెలుగులో బాగా ప్రజాదరణ పొందుతూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 103.86 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో సార్/వాతి సినిమాకు 18 రోజుల్లో రూ. 68.85 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే మరికొన్ని రోజుల్లో రూ. 70 కోట్ల నెట్ కలెక్షన్స్ క్లబ్ ను చేరుకోనుంది.


Click it and Unblock the Notifications











