Sir 21 Days Collection: సార్ కు పెరిగిన వసూళ్లు.. ఒక్కరోజులోనే అంత మార్పు.. లాభాలు తెలిస్తే?

సౌత్, నార్త్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సౌత్ హీరో ధనుష్. రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ధనుష్.. ఆ తర్వాత అనేక చిత్రాలతో ఎంటర్టైన్ చేశాడు. ఇక ఆయన ప్రతి సినిమా తెలుగలోనూ డబ్ అవుతున్న విషయం తెలిసిందే. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేకమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

తాజాగా ధనుష్ హీరోగా తమిళం, తెలుగు బైలింగువల్ చిత్రంగా వచ్చిన మూవీ సార్/వాతి. ఈ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ధనుష్ వాతి/సార్ సినిమాకు 21వ రోజు అంటే మూడు వారాల వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

 డైరెక్టర్ గా మారిన హీరో..

డైరెక్టర్ గా మారిన హీరో..

కోలీవుడ్ అగ్ర కథానాయకుడు ధనుష్ తాజాగా నటించిన ద్విబాషా చిత్రం సార్/వాతిని సితార ఎంటర్టైన్ మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిది. ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. స్నేహగీతం సినిమాలో హీరోగా అలరించిన వెంకీ అట్లూరి.. వరుణ్ తేజ్, రాశీ ఖన్నా నటించిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమా తర్వాత వెంకీ దర్శకత్వం వహించిన సినిమానే సార్.

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

నటనతో ఆకట్టుకునే హీరో ధనుష్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా సార్ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నిజాం ఏరియాలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ అయింది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అవ్వగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది.

అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా ఉంది.

21వ రోజు తెలుగులో

21వ రోజు తెలుగులో

ధనుష్ తెలుగులో నేరుగా చేసిన సార్ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అదే కంటిన్యూ అవుతూ.. 21వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్ లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 1 లక్ష, గుంటూరు రూ. 2 లక్షలు, కృష్ణా రూ. 2 లక్షలు, నెల్లూరు రూ. 1 లక్ష కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో మొత్తంగా రూ. 31 లక్షలు షేర్ కలెక్షన్స్ రాగా.. రూ. 60 లక్షలు గ్రాస్ కలెక్షన్స్ వసూళు అయ్యాయి.

3 వారాల్లో వచ్చింది..

3 వారాల్లో వచ్చింది..

భీమ్లా నాయక్ బ్యూటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ధనుష్ తాజా చిత్రం సార్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో 21 రోజుల్లో నైజాంలో రూ. 8.27 కోట్లు, సీడెడ్ లో రూ. 2.91 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 3.01 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 1.88 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 85 లక్షలు, గుంటూరు 1.53 కోట్లు, కృష్ణా రూ. 1.37 కోట్లు, నెల్లూరు రూ. 74 లక్షల కలెక్షన్స్ నమోదు చేసింది. అంటే మొత్తంగా 3 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.56 కోట్ల షేర్, రూ. 38.60 కోట్ల గ్రాస్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ లో కలిపి రూ. 1.40 కోట్లు వసూళు చేసింది. అంటే మొత్తంగా తెలుగు వెర్షన్ కు రూ. 21.96 కోట్లు షేర్, రూ. 41.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..

ధనుష్ సార్ సినిమాకు జీవీ ప్రకాష్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది. దీంతో కలెక్షన్ల పరంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో 21 రోజుల్లో రూ. 38.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. తమిళనాడులో రూ. 38.45 కోట్లు, కర్ణాటకలో రూ. 7.88 కోట్లు, కేరళలో రూ. 1.15 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.18 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 24.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో సార్/వాతి సినిమాకు వరల్డ్ వైడ్ గా 21 రోజుల్లో రూ. 111.31 కోట్లు గ్రాస్, రూ. 57.89 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే బుధవారం వరకు తమిళంలో గ్రాస్ కలెక్షన్స్ ఎక్కువ ఉండగా.. గురువారం ఒక్కరోజుతో తెలుగులో వసూళ్లు ఎక్కువయ్యాయి.

అన్ని లాభాలా?

అన్ని లాభాలా?

తెలుగు రాష్ట్రాల్లో ధనుష్ సినిమా సార్ కు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 5.50 కోట్లు కాగా రూ. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుని రూ. 14.56 కోట్ల ఫ్రాఫిట్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ కలుపుకుని రూ. 6.20 ప్రీ రిలీజ్ బిజినెస్ కు బ్రేక్ ఈవెన్ రూ. 6.70 కోట్లు నమోదు అయింది.

ఇలా చూసుకుంటే తెలుగు వెర్షన్ కు రూ. 15.26 కోట్లు లాభంతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసి రూ. 21.89 కోట్లు ప్రాఫిట్ అందుకుంది. దీంతో ధనుష్ సార్/వాతి సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X