Sir 23 Days Collection: సార్ రికార్డు వసూళ్లు.. తమిళంలో కంటే తెలుగులోనే.. అన్ని కోట్ల లాభం!

కేవలం దక్షిణాదిలోనే కాకుండా హిందీ, హాలీవుడ్ చిత్రాల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంటున్న తమిళ స్టార్ హీరో ధనుష్. హిందీలో రాంఝానా, ఆత్రంగి రే వంటి మంచి హిట్స్ అందుకున్న ధనుష్ గతేడాది ది గ్రే మ్యాన్ సినిమాలో నెగెటివ్ పాత్రలో కనువిందు చేశాడు. కాంట్రాక్ట్ కిల్లర్ అవిక్ సాన్ గా మంచి నటనతో అలరించాడు.

అలాగే లవ్ స్టోరీగా తిరు, సస్పెన్స్ థ్రిల్లర్ గా నేనే వస్తున్నా చిత్రాలతో ముందుకు వచ్చిన ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఈ ఏడాది వచ్చిన బైలింగువల్ చిత్రంగా సార్/వాతి సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో 23 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేద్దామా!

ద్విభాష చిత్రంగా..

ద్విభాష చిత్రంగా..

తమిళ స్టార్ హీరో ధనుష్ తన విలక్షణ నటనతో అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన నటనా నైపుణ్యానికి తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు అయ్యారు. ఇక ధనుష్ తాజా ద్విబాషా చిత్రం సార్/వాతిని డైరెక్టర్ త్రివిక్రమ్ బ్యానర్ అయిన సితార ఎంటర్టైన్ మెంట్ తోపాటు ఫార్చ్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు హీరోగా, నటుడిగా ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్ గా మారిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

విలక్షణ నటనతో ఎంటర్టైన్ చేసే హీరో ధనుష్ కు ఉన్న మార్కెట్ కు అనుగుణంగానే సార్/వాతి సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ అయింది.

అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అవ్వగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది. అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా నెలకొంది.

23వ రోజు తెలుగు రాష్ట్రాల్లో..

23వ రోజు తెలుగు రాష్ట్రాల్లో..

ధనుష్ తెలుగులో నేరుగా చేసిన సార్ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి వసూళ్లు వస్తున్నాయి. అదే కంటిన్యూ అవుతూ.. 23వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్ లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 1 లక్ష, గుంటూరు 2 లక్షలు, కృష్ణా రూ. 2 లక్షలు, నెల్లూరు రూ. 1 లక్ష కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో మొత్తంగా రూ. 33 లక్షలు షేర్ కలెక్షన్స్ రాగా.. రూ. 60 లక్షలు గ్రాస్ కలెక్షన్స్ వసూళు అయ్యాయి.

 23 రోజుల్లో వచ్చింది..

23 రోజుల్లో వచ్చింది..

బింబిసార ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరో ధనుష్ తో జోడీ కట్టిన తాజా చిత్రం సార్. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో 23 రోజుల్లో నైజాంలో రూ. 8.49 కోట్లు, సీడెడ్ లో రూ. 2.99 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 3.13 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 1.93 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 87 లక్షలు, గుంటూరు రూ. 1.56 కోట్లు, కృష్ణా రూ. 1.40 లక్షలు, నెల్లూరు రూ. 76 లక్షల కలెక్షన్స్ నమోదు చేసింది.

అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 21.13 కోట్ల షేర్, రూ. 39.65 కోట్ల గ్రాస్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ లో కలిపి రూ. 1.40 కోట్లు వసూళు చేసింది. అంటే మొత్తంగా తెలుగు వెర్షన్ కు రూ. 22.53 కోట్లు షేర్, రూ. 42.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..

విద్య, స్కూల్లు వంటి సందేశాత్మక చిత్రంగా వచ్చిన తమిళ స్టార్ హీరో ధనుష్, వెంకీ అట్లూరి బైలింగువల్ మూవీ సార్/వాతికి కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. దీంతో ఈ చిత్రానికి 23 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 39.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. తమిళనాడులో రూ. 39.20 కోట్లు, కర్ణాటకలో రూ. 7.92 కోట్లు, కేరళలో రూ. 1.15 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 24.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

దీంతో సార్/వాతి సినిమాకు వరల్డ్ వైడ్ గా 23 రోజుల్లో రూ. 113.42 కోట్లు గ్రాస్, రూ. 59.03 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే తమిళంలో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే సార్ కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

బ్లాక్ బస్టర్ హిట్.. లాభం ఎంతంటే..

బ్లాక్ బస్టర్ హిట్.. లాభం ఎంతంటే..

తెలుగు రాష్ట్రాల్లో ధనుష్ సినిమా సార్ కు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 5.50 కోట్లు కాగా రూ. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుని రూ. 15.13 కోట్ల ఫ్రాఫిట్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ కలుపుకుని రూ. 6.20 ప్రీ రిలీజ్ బిజినెస్ కు బ్రేక్ ఈవెన్ రూ. 6.70 కోట్లు నమోదు అయింది.

ఇలా చూసుకుంటే తెలుగు వెర్షన్ కు రూ. 15.83 కోట్లు లాభంతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసి రూ. 23.03 కోట్లు ప్రాఫిట్ అందుకుంది. దీంతో ధనుష్ సార్/వాతి సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X