Sir 26 Days Collection: హవా చాటుతున్న ధనుష్ 'సార్' మూవీ.. త్రివిక్రమ్ లాభాలు ఎంతంటే?
కేవలం దక్షిణాదిలోనే కాకుండా హిందీ, హాలీవుడ్ చిత్రాల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంటున్న తమిళ స్టార్ హీరో ధనుష్. హిందీలో రాంఝానా, ఆత్రంగి రే వంటి మంచి హిట్స్ అందుకున్న ధనుష్ గతేడాది ది గ్రే మ్యాన్ సినిమాలో నెగెటివ్ రోల్ తో ఇంప్రెస్ చేశాడు. కాంట్రాక్ట్ కిల్లర్ అవిక్ సాన్ గా మంచి నటనతో అలరించాడు. అలాగే లవ్ స్టోరీగా తిరు, సస్పెన్స్ థ్రిల్లర్ గా నేనే వస్తున్నా చిత్రాలతో ముందుకు వచ్చిన ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఈ ఏడాది సందేశాత్మక చిత్రంగా వచ్చిన సార్/వాతి మంచి కలెక్షన్స్ తో అదరగొడుతోంది. ఈ క్రమంలో 26 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేద్దామా!

వెంకీ అట్లూరి దర్శకత్వంలో..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన విలక్షణ నటనతో అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన నటనా నైపుణ్యానికి తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు అయ్యారు. ఇక ధనుష్ తాజా ద్విబాషా చిత్రం సార్/వాతిని డైరెక్టర్ త్రివిక్రమ్ బ్యానర్ అయిన సితార ఎంటర్టైన్ మెంట్ తోపాటు ఫార్చ్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి హీరోగా, నటుడిగా ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్ గా మారిన వెంకీ అట్లూరి దర్శకత్వం చేశారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
విలక్షణ నటనతో ఎంటర్టైన్ చేసే హీరో ధనుష్ కు ఉన్న మార్కెట్ కు అనుగుణంగానే సార్/వాతి సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ అయింది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అవ్వగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లుగా ఫిక్స్ అయింది. అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా నమోదు అయింది.

26 రోజుల్లో వచ్చింది..
ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరో ధనుష్ తో జోడీ కట్టిన లేటెస్ట్ మూవీనే సార్. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో 26 రోజుల్లో నైజాంలో రూ. 8.83 కోట్లు, సీడెడ్ లో రూ. 3.12 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 3.30 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 2.02 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 91 లక్షలు, గుంటూరు రూ. 1.61 కోట్లు, కృష్ణా రూ. 1.47 లక్షలు, నెల్లూరు రూ. 80 లక్షల కలెక్షన్స్ నమోదు చేసింది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 22.06 కోట్ల షేర్, రూ. 41.45 కోట్ల గ్రాస్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ లో కలిపి రూ. 1.40 కోట్లు వసూళు చేసింది. అంటే మొత్తంగా తెలుగు వెర్షన్ రూ. 23.46 కోట్లు షేర్, రూ. 44.60 కోట్లు గ్రాస్ సాధించింది.

వరల్డ్ వైడ్ గా వచ్చింది..
రేపటి తరానికి విద్య అనేది చాలా ముఖ్యమనే సందేశాత్మక చిత్రంగా వచ్చిన తమిళ స్టార్ హీరో ధనుష్, వెంకీ అట్లూరి బైలింగువల్ మూవీ సార్/వాతికి కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. దీంతో ఈ చిత్రానికి 26 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 41.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. తమిళనాడులో రూ. 40.90 కోట్లు, కర్ణాటకలో రూ. 8.02 కోట్లు, కేరళలో రూ. 1.17 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.23 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 24.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో సార్/వాతి సినిమాకు వరల్డ్ వైడ్ గా 26 రోజుల్లో రూ. 117.37 కోట్లు గ్రాస్, రూ. 61.17 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టింది.

ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా
తెలుగు రాష్ట్రాల్లో ధనుష్ సినిమా సార్ కు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 5.50 కోట్లు కాగా రూ. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుని రూ. 16.06 కోట్ల ఫ్రాఫిట్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ కలుపుకుని రూ. 6.20 ప్రీ రిలీజ్ బిజినెస్ కు బ్రేక్ ఈవెన్ రూ. 6.70 కోట్లు నమోదు అయింది. ఇలా చూసుకుంటే తెలుగు వెర్షన్ కు రూ. 16.76 కోట్లు లాభంతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసి రూ. 25.17 కోట్లు ప్రాఫిట్ అందుకుంది. దీంతో ధనుష్ సార్/వాతి సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.


Click it and Unblock the Notifications











