Sir 27 Days Collection: తెలుగులో దుమ్ము లేపిన సార్.. అన్ని కోట్లతో తివిత్రమ్ కు లాభాలు!
చాలా కాలంగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ తనదైన గుర్తింపు పొందాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా నిత్యం ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకుంటూ సత్తా చాటుతున్నాడు. విలక్షణ నటనతో అబ్బురపరిచే ధనుష్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ బైలింగువల్ సినిమా సార్/వాతి ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ద్విభాష చిత్రంగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో సార్ సినిమా ఇప్పటికే రూ. 117.37 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. 27వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం!

దర్శకుడిగా మారి..
తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన ద్విబాషా చిత్రం సార్/వాతిని సితార ఎంటర్టైన్ మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించగా.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. స్నేహగీతం సినిమాలో హీరోగా అలరించిన వెంకీ అట్లూరి.. వరుణ్ తేజ్, రాశీ ఖన్నా నటించిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాల తర్వాత వెంకీ దర్శకత్వం వహించిన సినిమానే సార్. స్కూల్ చదువు కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్..
యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకునే హీరో ధనుష్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా సార్ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నిజాం ఏరియాలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ అయింది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అవ్వగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది. అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా ఫిక్స్ అయింది.

27వ రోజు తెలుగులో
ధనుష్ తెలుగులో నేరుగా చేసిన సార్ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అదే కొనసాగుతూ 27వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 15 లక్షల షేర్ వసూళ్లు, రూ. 30 లక్షల గ్రాస్ రాబట్టగలిగింది.

27 రోజులకు కలిపి..
కేరళ బ్యూటి సంయుక్త మీనన్, ధనుష్ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం సార్ కు మంచి ప్రేక్షక ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో 27 రోజుల్లో నైజాంలో రూ. 8.89 కోట్లు, సీడెడ్ లో రూ. 3.14 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 3.32 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 2.03 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 92 లక్షలు, గుంటూరు 1.62 కోట్లు, కృష్ణా రూ. 1.48 కోట్లు, నెల్లూరు రూ. 81 లక్షల కలెక్షన్స్ నమోదు చేసింది. అంటే మొత్తంగా 27 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 22.21 కోట్ల షేర్, రూ. 41.75 కోట్ల గ్రాస్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ లో కలిపి రూ. 1.40 కోట్లు వసూళు చేసింది. అంటే మొత్తంగా తెలుగు వెర్షన్ కు రూ. 23.61 కోట్లు షేర్, రూ. 44.90 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

వరల్డ్ వైడ్ గా ఎంతంటే..
ధనుష్ సార్ సినిమాకు జీవీ ప్రకాష్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీంతో కలెక్షన్ల పరంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే 27 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 41.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. తమిళనాడులో రూ. 40.55 కోట్లు, కర్ణాటకలో రూ. 8.03 కోట్లు, కేరళలో రూ. 1.17 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.24 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 24.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో సార్/వాతి సినిమాకు వరల్డ్ వైడ్ గా 27 రోజుల్లో రూ. 117.89 కోట్లు గ్రాస్, రూ. 61.45 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఈసారి తమిళంలో కంటే తెలుగులోనే వసూళ్లు పెరిగనట్లు తెలుస్తోంది.

అన్ని లాభాలా?
తెలుగు రాష్ట్రాల్లో ధనుష్ సినిమా సార్ కు తెలుగు వెర్షన్ లో రూ. 6.20 ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా బ్రేక్ ఈవెన్ రూ. 6.70 కోట్లు నమోదు అయింది. ఇలా ధనుష్ సార్ సినిమాకు మొత్తంగా తెలుగు వెర్షన్ లో రూ. 16.91 కోట్లు లాభంతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసి రూ. 25.45 కోట్లు ప్రాఫిట్ అందుకుంది. దీంతో ధనుష్ సార్/వాతి సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.


Click it and Unblock the Notifications











