Sir 8 Days Collection: వరల్డ్ వైడ్ హిట్ గా 'సార్'.. 80 కోట్ల దిశగా సినిమా.. త్రివిక్రమ్ కు అన్ని కోట్ల లాభం!

కేవలం దక్షిణాదిలోనే కాకుండా హిందీ, హాలీవుడ్ చిత్రాల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంటున్న తమిళ స్టార్ హీరో ధనుష్. హిందీలో రాంఝానా, ఆత్రంగి రే వంటి మంచి హిట్స్ అందుకున్న ధనుష్ గతేడాది ది గ్రే మ్యాన్ సినిమాలో నెగెటివ్ రోల్ తో ఇంప్రెస్ చేశాడు. కాంట్రాక్ట్ కిల్లర్ అవిక్ సాన్ గా మంచి నటనతో అట్రాక్ట్ చేశాడు.

అలాగే లవ్ స్టోరీ మూవీగా తిరు, సస్పెన్స్ థ్రిల్లర్ గా నేనే వస్తున్నా చిత్రాలతో ముందుకు వచ్చిన ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. తాజాగా బైలింగువల్ చిత్రంగా సార్/వాతి సినిమాతో ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు 8 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేద్దామా!

హీరోగా ఎంట్రీ ఇచ్చి..

హీరోగా ఎంట్రీ ఇచ్చి..

తమిళ స్టార్ హీరో ధనుష్ తన విలక్షణ నటనతో అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన నటనాకౌశల్యానికి తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ అయ్యారు. ధనుష్ తాజా ద్విబాషా చిత్రం సార్/వాతిని డైరెక్టర్ త్రివిక్రమ్ బ్యానర్ అయిన సితార ఎంటర్టైన్ మెంట్ తోపాటు ఫార్చ్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు హీరోగా ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్ గా మారిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

తన విలక్షణ నటనతో ఆకట్టుకునే హీరో ధనుష్ కు ఉన్న మార్కెట్ కు అనుగుణంగానే సార్/వాతి సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ అయింది.

అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అవ్వగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది. అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా ఉంది.

8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో..

8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో..

ధనుష్ తెలుగులో నేరుగా చేసిన సార్ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అదే కంటిన్యూ అవుతూ.. 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 28 లక్షలు, సీడెడ్ లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 2 లక్షలు, గుంటూరు 4 లక్షలు, కృష్ణా రూ. 3 లక్షలు, నెల్లూరు రూ. 2 లక్షలు కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో మొత్తంగా రూ. 67 లక్షలు షేర్ కలెక్షన్స్ రాగా.. రూ. 1.30 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూళు అయ్యాయి.

8 రోజుల్లో వచ్చింది..

8 రోజుల్లో వచ్చింది..

బింబిసార ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరో ధనుష్ తో జోడీ కట్టిన తాజా చిత్రం సార్. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో నైజాంలో రూ. 5.24 కోట్లు, సీడెడ్ లో రూ. 1.90 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.76 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 1.21 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 49 లక్షలు, గుంటూరు రూ. 1.01 కోట్లు, కృష్ణా రూ. 84 లక్షలు, నెల్లూరు రూ. 48 లక్షల కలెక్షన్స్ నమోదు చేసింది.

అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.93 కోట్ల షేర్, రూ. 24.21 కోట్ల గ్రాస్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ లో కలిపి రూ. 1.14 కోట్లు వసూళు చేసింది. అంటే మొత్తంగా తెలుగు వెర్షన్ కు రూ. 14.07 కోట్లు షేర్, రూ. 26.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..

విద్య, స్కూల్లు వంటి సందేశాత్మక చిత్రంగా వచ్చిన తమిళ స్టార్ హీరో ధనుష్, వెంకీ అట్లూరి బైలింగువల్ మూవీ సార్/వాతికి కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో రూ. 24.21 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. తమిళనాడులో రూ. 24.35 కోట్లు, కర్ణాటకలో రూ. 5.60 కోట్లు, కేరళలో రూ. 80 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 92 లక్షలు, ఓవర్సీస్ లో రూ. 16.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

దీంతో సార్/వాతి సినిమాకు వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో రూ. 72.03 కోట్లు గ్రాస్, రూ. 37.55 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టింది.

బ్లాక్ బస్టర్ హిట్.. లాభం ఎంతంటే..

బ్లాక్ బస్టర్ హిట్.. లాభం ఎంతంటే..

తెలుగు రాష్ట్రాల్లో ధనుష్ సినిమా సార్ కు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 5.50 కోట్లు కాగా రూ. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుని రూ. 6.93 కోట్ల ఫ్రాఫిట్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ కలుపుకుని రూ. 6.20 ప్రీ రిలీజ్ బిజినెస్ కు బ్రేక్ ఈవెన్ రూ. 6.70 కోట్లు నమోదు అయింది. ఇలా చూసుకుంటే తెలుగు వెర్షన్ కు రూ. 7.37 కోట్లు లాభంతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక వరల్డ్ వైడ్ గా రూ. 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 8 రోజుల్లో పూర్తి చేసి రూ. 1.55 కోట్లు ప్రాఫిట్ అందుకుంది. దీంతో ధనుష్ సార్/వాతి సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ స్టేటస్ అందుకుంది. అలాగే రూ. 72.03 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా రూ. 80 కోట్ల వైపుగా పయనిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X