Sir 9 Days Collection: వరల్డ్ వైడ్ గా దూసుకుపోతున్న సార్ పాఠాలు.. లాభం ఎంతో తెలుసా!
రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్. అప్పటి నుంచి ఆయన సినిమాలో తెలుగులోనూ విడుదల చేస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాడు. 3, మారి, మారి 2, వీఐపీ 2 వంటి చిత్రాలను కూడా తెలుగులో విడుదల చేశాడు. వీటిలో ఎన్నో అంచనాల మధ్య రిలీజైన మారి 2, వీఐపీ 2 చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. ఇలా హిట్స్, ఫ్లాప్స్ అంటూ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు ధనుష్. తాజాగా నేరుగా తెలుగు సినిమా చేశాడు ధనుష్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్ సినిమా ఫిబ్రవరి 17న విడుదలై మంచి హిట్ గా నిలిచింది. ఆ క్రమంలోనే సార్ 9 రోజుల వసూళ్లపై లుక్ వేస్తే..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అంతేకాకుండా ఆయకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సైతం ఉన్నారు. అందుకే అంతటి ఫాలోయింగ్ ఉన్న ధనుష్ తో బైలింగువల్ చిత్రాన్ని నిర్మించారు సితార ఎంటర్టైన్ మెంట్ తోపాటు ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పేరుతో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆయన సతీమణి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించి విషయం తెలిసిందే.

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
ధనుష్ కు ఉన్న మార్కెట్ కు అనుగుణంగానే సార్/వాతి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ అయింది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అవ్వగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది. అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా ఉంది.

9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ దక్కించుకున్న కోలీవుడ్ హీరోల్లో ధనుష్ ఒకరు. ఆయన తాజాగా నేరుగా తెలుగులో చేసిన సార్ సినిమాకు విడుదలైన రోజు నుంచే మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అదే కంటిన్యూ అవుతూ.. 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 42 లక్షలు, సీడెడ్ లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 17 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 3 లక్షలు, గుంటూరు 5 లక్షలు, కృష్ణా రూ. 4 లక్షలు, నెల్లూరు రూ. 3 లక్షలు కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో మొత్తంగా రూ. 92 లక్షలు షేర్ కలెక్షన్స్ రాగా.. రూ. 1.75 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

9 రోజుల్లో వచ్చింది..
హీరోగానే కాకుండా సింగర్ గా కూడా మంచి పాపులారిటీ దక్కించుకున్న ధనుష్ తాజా చిత్రం సార్. ఈ మూవీకి తెలుగు ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ వస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో నైజాంలో రూ. 5.66 కోట్లు, సీడెడ్ లో రూ. 2.02 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.93 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 1.27 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 52 లక్షలు, గుంటూరు రూ. 1.06 కోట్లు, కృష్ణా రూ. 88 లక్షలు, నెల్లూరు రూ. 51 లక్షల కలెక్షన్స్ సాధించింది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.85 కోట్ల షేర్, రూ. 25.96 కోట్ల గ్రాస్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ లో కలిపి రూ. 1.18 కోట్లు వసూళు చేసింది. అంటే మొత్తంగా వరల్డ్ వైడ్ గా తెలుగు వెర్షన్ కు రూ. 15.03 కోట్లు షేర్, రూ. 28.45 కోట్లు గ్రాస్ లభించింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..
డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో అలరించే ధనుష్ తాజాగా విద్యకు ఉన్న ప్రాముఖ్యతను తెలిపే చిత్రమైన సార్/వాతితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో రూ. 25.96 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. తమిళనాడులో రూ. 26.15 కోట్లు, కర్ణాటకలో రూ. 6.15 కోట్లు, కేరళలో రూ. 85 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 95 లక్షలు, ఓవర్సీస్ లో రూ. 17.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. దీంతో సార్/వాతి సినిమాకు వరల్డ్ వైడ్ గా 9 రోజుల్లో రూ. 77.66 కోట్లు గ్రాస్ కు పైగా, రూ. 40.40 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టింది.

వరల్డ్ వైడ్ గా లాభాలు..
ఆంధ్ర, తెలంగాణలో ధనుష్ సినిమా సార్ కు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 5.50 కోట్లు కాగా రూ. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుని రూ. 7.85 కోట్ల ఫ్రాఫిట్ అందుకుంది. అలాగే తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్సీస్ కలుపుకుని రూ. 6.20 ప్రీ రిలీజ్ బిజినెస్ కు బ్రేక్ ఈవెన్ రూ. 6.70 కోట్లు నమోదు అయింది. ఇలా చూసుకుంటే తెలుగు వెర్షన్ కు రూ. 8.33 కోట్లు లాభంతో డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ హిట్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసి రూ. 4.40 కోట్లు ప్రాఫిట్ అందుకుని హిట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











