Sir Day 8 Collection: కొనసాగుతున్న సార్ హవా.. వీకెండ్ లో మరింతగా.. లాభాల్లో త్రివిక్రమ్!

సౌత్, నార్త్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న దక్షిణాది హీరో ధనుష్. రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆ తర్వాత అనేక చిత్రాలతో అలరించాడు. ఆయన ప్రతి సినిమా తెలుగలోనూ డబ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేకమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా ధనుష్ హీరోగా తమిళం, తెలుగు బైలింగువల్ చిత్రంగా వచ్చిన మూవీ సార్/వాతి. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ధనుష్ వాతి/సార్ సినిమాకు 8వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

పాఠశాల చదువు కాన్సెప్ట్..

పాఠశాల చదువు కాన్సెప్ట్..

తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన ద్విబాషా చిత్రం సార్/వాతిని సితార ఎంటర్టైన్ మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించగా.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. స్నేహగీతం సినిమాలో హీరోగా అలరించిన వెంకీ అట్లూరి.. వరుణ్ తేజ్, రాశీ ఖన్నా నటించిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాల తర్వాత వెంకీ దర్శకత్వం వహించిన సినిమానే సార్. స్కూల్ చదువు కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

 థియేటర్స్ కౌంట్ ఇలా..

థియేటర్స్ కౌంట్ ఇలా..

సినిమాలు హిట్ అయిన ఫెయిల్ అయినా అదేం పట్టించుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తుంటాడు స్టార్ హీరో ధనుష్. అందుకే ఆయన చిత్రాలు వెనువెంటనే వస్తాయి. ఈ కొత్త ఏడాది ధనుష్ నుంచి వచ్చిన సినిమా సార్. ఈ చిత్రానికి నైజాంలో 150, సీడెడ్ లో 55, ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా 200 థియేటర్లలో విడుదలైంది. ధనుష్ సార్ సినిమాను మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి 415కు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

ధనుష్ కు ఉన్న ఫాలోయింగ్ తోపాటు మార్కెట్ దృష్ట్యా సార్/వాతి సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాం ఏరియాలో రూ. 2.20 కోట్లు, సీడెడ్ లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.65 కోట్ల బిజినెస్ అయింది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ అవ్వగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లు నమోదు అయింది. అలాగే తమిళనాడులో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా ఉంది.

థియేటర్ ఆక్యుపెన్సీ డీటెల్స్..

థియేటర్ ఆక్యుపెన్సీ డీటెల్స్..

తెలుగు, తమిళంలో తెరకెక్కిన సార్/వాతి సినిమాలో ధనుష్ కు జోడిగా బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ జోడి కట్టింది. సినిమా విడుదలకు ముందు వచ్చిన మాస్టారు మాస్టారు అనే సాంగ్ ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఇక ఈ చిత్రానికి 8వ రోజు తెలుగులో ఉదయం 23.70 శాతం, మధ్యాహ్నానికి అంతే సాగుతూ 23.73 శాతం, సాయంత్రానికి కాస్తా పెరిగి 26.57 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అలాగే తమిళంలో ఉదయం 17.47 శాతం, మధ్యాహ్నం 17.58 శాతం, సాయంత్రానికి 19.23 శాతంగా నమోదు అయింది. అంటే ఎప్పటిలానే తమిళంలో కంటే తెలుగులోనే ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉందని అర్థం అవుతోంది.

 8వ రోజు కలెక్షన్స్ ఎంతంటే..

8వ రోజు కలెక్షన్స్ ఎంతంటే..

హీరో, నెగెటివ్ పాత్రలతో అదరగొట్టే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా స్కూల్ టీచర్ గా ఆకట్టుకున్న సినిమా సార్/వాతి. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తనదైన కామెడీతో ఆక్టట్టుకున్న ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే హిట్ టాక్ వస్తోంది. ఫలితంగా ధనుష్ సార్/వాతి సినిమాకు ఎనిమిదో రోజు రూ. 2 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అంటే ఫ్రైడే రోజు కూడా సార్ కు బాగానే కలెక్షన్స వచ్చినట్లు తెలుస్తోంది.

8 రోజుల కలెక్షన్స్..

8 రోజుల కలెక్షన్స్..

ఇటీవల హీరోలు, డైరెక్టర్స్ బైలింగువల్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. అయితే వాటిలో కొన్ని హిట్ కాగా మరికొన్ని ఫట్టుమంటున్నాయి. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి-ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన ద్విభాషా చిత్రం సార్/వాతికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు ఎనిమిది రోజుల్లో రూ. 48.05 కోట్ల నెట్ కలెక్షన్స్ రానున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

 లాభాల్లో త్రివిక్రమ్..

లాభాల్లో త్రివిక్రమ్..

మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ లో వచ్చిన ధనుష్ సార్ చిత్రం ఈ వీకెండ్ లో రూ. 2 కోట్లు సాధిస్తే రూ. 50 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సినిమా 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకుని లాభాలు అర్జించినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X