Dhoom Dhaam Collections: హెబ్బా పటేల్ మూవీ కలెక్షన్ల ఊపు.. ధూమ్ ధామ్ వసూళ్లు ఎన్ని లక్షలంటే?
యువ హీరో, హీరోయిన్లు చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన వినోద భరిత చిత్రం ధూమ్ ధామ్. ప్రవాసాంధ్రుడు, నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన చిత్రానికి సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ సినీ రచయిత గోపి మోహన్ స్క్రీన్ల ప్లే అందించారు. నవంబర్ 8వ తేదీన రిలీజైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్, కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..
వెన్నెల కిషోర్, గిరిధర్, బెనర్జీ, వినయ్ వర్మ తదితరులు నటించిన ఈ అవుట్ అండ్ అవుట్ సినిమాకు భారీగా రెస్సాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా థ్యాక్యూ మీట్‌లో గోపి మోహన్, దర్శకుడు సాయి కిషోర్ మచ్చా, నటుడు గిరిధర్, రామ్ కుమార్, చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, డైలాగ్ రైటర్ ప్రవీణ్ వర్మ, ఎడిటర్ అమర్ రెడ్డి కుడుముల తదితరులు పాల్గొన్నారు.

ఈ వారంపెద్ద సినిమాల పోటీలో "ధూం ధాం" లాంటి చిన్న సినిమా నిలదొక్కుకోవడమే గొప్ప విషయం. మేము ఇంకా పరుగు స్టార్ట్ చేయలేదు. నిలబడ్డాం అంతే. మా మూవీని ఆడియెన్స్ దాకా రీచ్ చేసిన క్రెడిట్ మీడియా మిత్రులదే అని అందరూ అన్నారు.
ధూమ్ ధామ్ సినిమా విషయానికి వస్తే.. భారీ తారాగణంతోను, విదేశాల్లోను భారీగా నిర్మించారు. పోలెండ్‌లో భారీ షెడ్యూల్‌ను నిర్వహించారు. అలాగే సెట్, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా నిర్మించడంతో ఈ మూవీని సుమారుగా 7 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను సుమారుగా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశఆరు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 4 కోట్లుగా వ్యాల్యూ కట్టారు.
ధూమ్ ధామ్ సినిమాకు ఓవర్సీస్‌లో మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రీమియర్ షోలకు బాక్సాఫీస్ వద్ద సానుకూలంగా స్పందన లభించింది. వారాంతంలో ఈ సినిమాకు వసూళ్లు నమోదు అవుతాయని భావిస్తున్నారు. ఈ సినిమా తొలి రోజు రోజుల్లో 50 లక్షల గ్రాస్ వసూలు నమోదు చేసిందని వెల్లడించారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ధూమ్ ధామ్ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో మెల్ల మెల్లగా కలెక్షన్లు పెరుగుతున్నాయి. సినిమాలో నాన్ స్టాప్ కామెడీ క్లిక్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద గౌరవప్రదమైన కలెక్షన్లు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మరో 50 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని యూనిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











