Dhoomam Collections కేజీఎఫ్, కాంతార నిర్మాతల నుంచి ధూమమ్.. తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
కేజీఎఫ్, కాంతార లాంటి భారీ చిత్రాలను నిర్మించిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తాజాగా నిర్మించిన చిత్రం ధూమమ్. లూసియా, యూ టర్న్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ సినిమా నిర్మాత. ఫాహద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ, అపర్ణ బాలమురళి, వినీత్, అచ్యుత్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రం జూన్ 23న రిలీజ్ అయింది. ఈ సినిమా కథ ఏంటి? ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..
ధూమమ్ సినిమా విషయానికి వస్తే.. అవినాష్ (ఫహద్ ఫాజిల్), దివ్య (అపర్ణా బాలమురళి) దంపతులు. అవినాష్ సిగరెట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఆ కంపెనీ అధినేత సిద్ (రోషన్ మ్యాథ్యూ) ఆర్బాటమైన ప్రచారంతో సిగరెట్ అమ్మకాలు పెంచేస్తాడు. సిగరెట్ల అమ్మకాలు పెరగడం, పిల్లలు ధూమపానానికి అలవాటు పడుతుండటం చూసి అవినాష్ తన ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు. ఆ తర్వాత అవినాష్, దివ్యపై కొందరు దాడి చేస్తారు. ఆ తర్వాత ఏమైందనేది సినిమా కథ.

ధూమమ్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. భారీ బడ్జెట్‌తోనే నిర్మించారు. ఈ సినిమాను దాదాపు 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను కేరళలో 150 స్క్రీన్లలో భారీగానే రిలీజ్ చేశారు. తొలి రోజు కేరళ, కర్నాటకలో భారీగానే ఓ మోస్తారు కలెక్షన్లు నమోదు అయ్యాయి.
ధూమమ్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీకి ఊహించినంత స్పందన కనిపించలేదు. ఈ సినిమా కేరళలో తొలి రోజు సుమారు 2 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 4 కోట్ల రూపాయలు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ధూమమ్ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి టార్గెట్ తక్కువగానే ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద 12 కోట్ల షేర్, 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఈ సినిమా ఏ రేంజ్‌లో లాభాలు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











