రామ్ చరణ్ ‘ధృవ’ కలెక్షన్ల పరిస్థితి ఏమిటి?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ మూవీ బాక్సాఫీసు వద్ద సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుని వసూళ్లతో దూసుకెలుతోంది.
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ధృవ' మూవీ బాక్సాఫీసు వద్ద సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుని వసూళ్లతో దూసుకెలుతోంది. ఇటుత తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది.
ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 74.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు తాము పెట్టిన పెట్టుబడిలో దాదాపుగా రికవరీ అయినట్లే అని అంటున్నారు. ఓవరాల్ గా దాదాపు 50 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది.

ఆంధ్ర, తెలంగాణల్లో 50 కోట్ల గ్రాస్.... రూ. 33.7 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. కర్నాటకలో రూ. 11 కోట్ల గ్రాస్ సాధించగా అందులో రూ. 6.2 కోట్ల షేర్ వచ్చినట్లు సమాచారం. రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్ల గ్రాస్ సాధించగా... రూ. 1.15 కోట్ల షేర్ వచ్చినట్లు సమాచారం.
ఇక ఓవర్సీస్ మాట్లెట్లో తొలి 11 రోజుల్లో 1.65 మిలియన్ డాలర్లు (రూ.11.10 కోట్లు)వసూలు చేసింది. ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ. 5.25 కోట్లకు అమ్ముడైంది. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ ప్రకారం రూ. 6.3 కోట్లు షేర్ వసూలు చేసి డీసెంట్ ప్రాఫిట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











